Pushpa 2 Update : పుష్పకు మరో సమస్య… ప్రాజెక్ట్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న ఎడిటర్

Pushpa 2 Update : మోస్ట్ అవైటింగ్ పాన్ ఇండియా సినిమాలలో పుష్ప 2 కూడా ఒకటి. ఈ మూవీ ఎప్పుడెప్పుడు తెరపైకి వస్తుందా? అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న బన్నీ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పుష్ప-2 మూవీకి మరో కొత్త సమస్య వచ్చిపడినట్టు సమాచారం. ప్రాజెక్ట్ నుంచి ప్రాజెక్ట్ నుంచి అర్ధాంతరంగా ఎడిటర్ తప్పుకున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది.

ప్రాజెక్ట్ నుంచి ఎడిటర్ అవుట్?

లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 2024 ఆగష్టు 15న విడుదల కానుంది. అయితే ఈ చిత్రం ప్రస్తుతం టెక్నికల్ ఛాలెంజ్ ను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ నుండి ఎడిటర్ ఆంటోనీ రూబెన్ తప్పుకున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. డేట్స్ ఇష్యూ కారణంగా ఆంటోని ఈ మూవీ నుంచి సైడ్ అయ్యాడని టాక్ నడుస్తోంది.

కొత్త ఎడిటర్ ఎవరంటే?

ఈ ఊహించని మార్పు ‘పుష్ప 2 : ది రూల్’ మూవీ విడుదల తేదీ ఆలస్యం కాకుండా ఉండేలా చూసుకోవడానికి చిత్రనిర్మాతలు వీలైనంత త్వరగా ఆయన ప్లేస్ ను వేరొక ఎడిటర్ తో భర్తీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం పుష్ప మేకర్స్ అదే పనిలో ఉన్నారని సమాచారం. కొత్త ఎడిటర్‌గా నవీన్‌ నూలిని ఎంపిక చేసుకున్నారని, ఇప్పటికే ఆయన పుష్ప మూవీ ఎడిటింగ్‌ బాధ్యతలు స్వీకరించారని తెలుస్తోంది.

- Advertisement -

పుష్ప-2కు ఇదొక్కటే సమస్య కాదు

పుష్ప మూవీకి ఇలాంటి సమస్యలు రావడం కొత్తేమీ కాదు. అంతకుముందు మొదటి పార్ట్ ‘పుష్ప 1: ది రైజ్’ విడుదల సమయంలో కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. దర్శకుడు సుకుమార్ చాలా టైట్ షెడ్యూల్‌తో పోరాడవలసి వచ్చింది. షూటింగ్ కు ఎక్కువ సమయం తీసుకోవడంతో పోస్ట్ ప్రొడక్షన్ ను చాలా తక్కువ టైమ్ లో పూర్తి చేయాల్సి వచ్చింది. ఈ హడావిడి టైమ్‌లైన్ వల్ల మూవీ ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్, సంగీతంతో సహా వివిధ అంశాలను ప్రభావితం చేసింది. దేవి శ్రీ ప్రసాద్ కూడా ఈ మూవీ కోసం అతి తక్కువ సమయంలోనే మ్యూజిక్ ఇవ్వాల్సి వచ్చింది. ఇది సౌండ్‌ట్రాక్ క్వాలిటీని ప్రభావితం చేసింది. చివరి నిమిషం దాకా ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతుందనే టాక్ నడిచింది.

సెకండ్ పార్ట్ కు కూడా కష్టాలే

ఇక ఇప్పుడు రెండవ పార్ట్ కు కూడా అలాగే సమస్యలు ఎదురవుతున్నాయి. షూటింగ్ లేట్ కావడం, జగదీష్ అరెస్ట్ కావడం వంటి సమస్యలతో పాటు ఇప్పుడు ఎడిటర్ తప్పుకున్నారు. అయితే ఇంకా మూవీ రిలీజ్ కు చాలా టైమ్ మిగిలి ఉండడంతో ఈ సమస్యలను ఎదుర్కోవడానికి మేకర్స్ రెడీగానే ఉన్నారు. సాంకేతిక అవాంతరాలు ఉన్నప్పటికీ ప్రకటించిన విడుదల తేదీకి సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ పట్టుదలతో ఉన్నారు. భారీ అంచనాలున్న ఈ మూవీ నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప పుష్ప సాంగ్ కు మంచి రెస్పాన్స్ దక్కింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు