Pushpa 2 : బన్నీ కొంప ముంచిన షెకావత్… వాయిదాకి కారణం ఆయనే..

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. గతంలో పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ మంచి టాక్ ను అందుకోవడంతో ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది.. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమా రాబోతుంది.. ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ ఈగర్ వెయిట్ చేస్తున్నారు.. ఈ సినిమాను ఆగష్టు లో విడుదల చేస్తామని మేకర్స్ ముందుగా ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే ఇటీవల పోస్ట్ పోన్ చేస్తున్నట్లు పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నారు.. సినిమా పోస్ట్ పోన్ అవ్వడానికి కారణం సినిమాలోని విలన్ అని వార్తలు వినిపిస్తున్నాయి..

అల్లు అర్జున్ పార్ట్ షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది.. కానీ విలన్ గా, పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఫహాద్ ఫాజిల్ వల్లే సినిమా డిలే అయిందని గతంలో వార్తలు వచ్చాయి.. దీనిపై మాత్రమే ఫహాద్ పెద్దగా స్పందించలేదు కానీ సుకుమార్ మాత్రమే క్లారిటి ఇచ్చారు.. అయితే ఫహాద్ రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగానే తీసుకుంటున్నాడు.. రోజు రూ. 12 లక్షలు డిమాండ్ చేస్తున్నాడు. ఒకవేళ షూటింగ్ క్యాన్సిల్ అయితే మరో రెండు లక్షలు చెల్లించుకోవాలి.. ఇంత ఇస్తున్నా కూడా ఆయన షూటింగ్ కోసం సరిగ్గా డేట్స్ ఇవ్వకపోవడమే అందరిని ఆలోచింపచేస్తుంది..

Pushpa 2's release was postponed because of Fahadh Fazil
Pushpa 2’s release was postponed because of Fahadh Fazil

నిజానికి ఫాజిల్ కు తెలుగు సినిమాల పై కోపం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి… ఎందుకంటే మలయాళ సినిమాలకు ఆదరణ రాకుండా తెలుగు మేకర్స్ చేస్తున్నారనే ఆరోపణలు గతంలో ఓ ఇంటర్వ్యూలో చేశారు.. అలాగే ఓటీటీ సంస్థల తీరుపై కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.. ఆ కారణంతోనే పుష్ప 2 షూటింగ్ కు డేట్స్ ఇవ్వలేదనే టాక్ నడుస్తుంది.. ఇందులో నిజమేంత ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రమే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. ఫహాద్ వల్లే సినిమా పోస్ట్ పోన్ అయ్యిందని బన్నీ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.. ప్రస్తుతానికి డిసెంబర్ 6 న రిలీజ్ చెయ్యనున్నట్లు ప్రకటించినా కూడా ఆ డేట్ కు కూడా సినిమా వస్తుందనే నమ్మకాలు లేవని తెలుస్తుంది.. మరి సుక్కు దీనిపై ఏదైన క్లారిటీ ఇస్తారేమో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు