PushpaTheRule : ఏంటి.. పుష్ప2 షూటింగ్ ఇంకా అన్ని రోజులు బాకీ ఉందా?

PushpaTheRule : టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా వైడ్ గా మూవీస్ లవర్స్ ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ సినిమాల్లో పుష్ప ది రూల్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. బాహుబలి కెజిఎఫ్ సీక్వెల్స్ తర్వాత ఆ రేంజ్ అంచనాలు ఈ సినిమాపై నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా కోసం హిందీ ఆడియన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. మేకర్స్ కూడా దానికి తగ్గట్టే ప్రమోషన్లు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అల్లు అర్జున్ అయితే పుష్ప ఫినిష్ అయ్యేదాకా వేరే సినిమా మొదలు పెట్టకూడదని దీనిపైనే ఫోకస్ పెట్టాడు. అయితే పుష్ప2 షూటింగ్ రెండేళ్లగా తెరకెక్కుతుందన్న సంగతి తెలిసిందే. సమ్మర్ లో రావాల్సిన సినిమా ఆగష్టు 15 కి వాయిదా వేశారు. తీరా రిలీజ్ డేట్ దగ్గరవుతున్న కొద్దీ ఫైనల్ గా మేకర్స్ డిసెంబర్ 6కి వాయిదా వేసి పెద్ద బాంబ్ వేశారు.

PushpaTheRule Movie Latest Shooting Update

రిలీజ్ పై మళ్ళీ అనుమానాలు?

అయితే పుష్ప2 ని ఆగష్టు 15న రిలీజ్ చేస్తామని అంటూ, వాయిదా అనే రూమర్లు ఏవి నమ్మొద్దని చిత్ర యూనిట్ బన్నీ అభిమానులకు నొక్కి మరీ చెప్పారు. కానీ ఫైనల్ గా మేకర్స్ మాత్రం ఏకంగా డిసెంబర్ కి తీసుకుపోయారు. మంచి స్క్రిప్ట్ ని అభిమానులకు ఇచ్చే ఉద్దేశంతోనే పక్కా సినిమాని ఇవ్వాలని వాయిదా వేశామని మేకర్స్ చెప్పుకొచ్చారు. అయితే ఆ మధ్య మేకర్స్ పుష్ప2 షూటింగ్ 90 శాతం పూర్తయిందని మరో రెండు వారాల షెడ్యూల్, సాంగ్స్ మాత్రమే ఉన్నట్టు చెప్పగా, కానీ తాజాగా అందిన సమాచారం ప్రకారం పుష్ప ది రూల్ కి సంబంధించి చాలా వర్క్ పెండింగ్ లో ఉందట.

- Advertisement -

ఇంకా అన్ని రోజుల షూటింగ్ ఉందా?

లేటెస్ట్ గా వచ్చిన సమాచారం ప్రకారం పుష్ప ది రూల్ (PushpaTheRule) కి సంబంధించి ఇంకా నెలరోజుల షూటింగ్ బకాయి ఉందట. అంటే 30 రోజులకి పైగా షూటింగ్ బ్యాలన్స్ ఉందట. ఇవి గాక మరో సాంగ్ షూటింగ్ కూడా ఉందట. ఎంత లేదన్నా, ఆగష్టు తో పాటు సెప్టెంబర్ లో కూడా నటీనటులు డేట్లు కేటాయించాల్సి ఉంటుందట. మరి మేకర్స్ ఇంత ల్యాగ్ చేయడానికి కారణమేంటో తెలియట్లేదు గాని, మూవీ లవర్స్ మాత్రం డిసెంబర్ కన్నా తెస్తారా లేదా అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం షూటింగ్ బ్రేక్ లో ఉన్న చిత్ర యూనిట్ జులై లాస్ట్ వీక్ నుండి కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారని సమాచారం. మరి పుష్ప నుండి మరో అప్డేట్ ఎప్పుడొస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు