PushpaTheRule : పుష్ప కి నిజంగా అంత సీనుందా?

PushpaTheRule : టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా వైడ్ గా మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న క్రేజీ పాన్ ఇండియా సినిమా “పుష్ప ది రూల్”. ఈ సినిమా పై వరల్డ్ వైడ్ గా ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాక్స్ ఆఫీస్ వద్ద మినిమం వెయ్యి కోట్లు అన్న టాక్ ఈ సినిమాపై వస్తుంది. అంతటి క్రేజ్ రావడానికి పుష్ప ది రైజ్ సినిమా సాధించిన బ్లాక్ బస్టర్ సక్సెసే కారణమని తెలుసు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ జీనియస్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్ లో మూడేళ్ళ కింద వచ్చిన పుష్ప ఓ రేంజ్ భీభత్సం సృష్టించగా, ఇప్పుడు సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2పై ఏకంగా పదింతల అంచనాలు పెంచేసింది. ఇక పుష్ప2 2024 సమ్మర్ కి రిలీజ్ కావాల్సి ఉండగా, పలు రకాల కారణాల వల్ల వాయిదాల పర్వం కంటిన్యూ చేస్తూ, ఫైనల్ గా డిసెంబర్ 6కి ఫిక్స్ అయింది.

PushpaTheRule OTT rights acquired by Netflix

అల్ టైం రేటుకి పుష్ప ఓటిటి రైట్స్..

ఇదిలా ఉండగా తాజాగా పుష్ప ది రూల్ (PushpaTheRule) కి సంబంధించి డిజిటల్ సాటిలైట్ రైట్స్ బిజినెస్ పనులు కూడా పూర్తి చేసుకుంది. కాగా తాజాగా పుష్ప2 ఓటిటి హక్కులను తాజాగా ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ ‘నెట్ ఫ్లిక్స్’ (Net Flix) సంస్థ ఏకంగా 270 కోట్ల భారీ రేటుని చెల్లించి పుష్ప2 రైట్స్ ని దక్కించుకుందని సమాచారం. ఇది అల్ టైం రికార్డ్ అని తెలుస్తుంది. ఇంతకు ముందు టాప్ లో ఉన్న కల్కి2898AD, RRR ల రికార్డ్ ని బ్రేక్ చేసి పుష్ప2 టాప్ లో నిలిచిందట. ఇక సినిమా థియేట్రికల్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరుగుతుందని సమాచారం. అయితే చిత్ర ప్రమోషన్లలో కాస్త టైం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.

- Advertisement -

నిజంగా అంత సీనుందా?

అయితే పుష్ప2 ఓటిటి రైట్స్ కి జరిగిన బిజినెస్ కి నెట్టింట ఓ వైపు పాజిటివ్ కామెంట్స్ వస్తున్నా, మరోవైపు నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. నిజానికి సినిమాకే వెయ్యి కోట్ల సత్తా ఉన్నా, బిజినెస్ పరంగా ఓవర్ చేస్తుందేమో అన్న చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే పుష్ప పార్ట్ వన్ ఎంత పెద్ద హిట్ అయినా, తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా బ్రేక్ ఈవెన్ కాలేదని గుర్తించుకోవాలి. పైగా బాహుబలి, కెజిఎఫ్ లతో పుష్ప ని పోల్చితే, ఓ దశలో దెబ్బేసే ఛాన్స్ కూడా ఉంది. ఆ రేంజ్ లో ఇంపాక్ట్ చూపించకపోతే లాంగ్ రన్ విషయంలో దెబ్బ పడే ఛాన్స్ ఉంది. అన్నిటికీ మించి రీసెంట్ గా అల్లు అర్జున్ (Allu arjun) వ్యక్తిగత ప్రవర్తన వల్ల, తెలుగు రాష్ట్రాల్లో ఒక సెక్షన్ అఫ్ ఆడియన్స్ కి ఓ రకమైన నెగిటివిటీ వస్తుంది. ముఖ్యంగా మెగాఫ్యాన్స్ లో నెగిటివిటీ బాగా పెరిగిపోయింది. దీనివల్ల సినిమాకి కాస్త అటు ఇటుగా టాక్ వచ్చినా అంచనాలని అందుకోవడంలో విఫలమయ్యే ఛాన్స్ ఉంది. కనుక మేకర్స్ మరీ అతి చేయకుండా సేఫ్ గేమ్ ఆడితే బెటర్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు