Raayan: కేవలం మూడు రోజుల్లో ఆ పండగ రిలీజ్ సినిమా రికార్డ్స్ ను క్రాస్ చేసింది

Raayan: కొన్ని సినిమాలు ఎలాంటి విజయం సాధిస్తాయో ఎవరూ ఊహించలేరు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోతుంటాయి. కొన్ని సినిమాలకు మంచి టాక్ వచ్చినా కూడా ఆ సినిమాలకు సరైన స్థాయిలో కలెక్షన్స్ రావు. ఇంకొన్ని సినిమాలకు మంచి రిలీజ్ డేట్స్ దొరికినా కూడా సినిమా వర్కౌట్ కాకపోతే ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరించరు. ఇకపోతే ధనుష్ సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా కెప్టెన్ మిల్లర్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ ను సాధించలేకపోయింది అయితే ఈ సినిమా కూడా కలెక్షన్స్ ఊహించిన అంతగా రాలేదు. మంచి రిలీజ్ డేట్ దొరికినా కూడా స్క్రిప్ట్ వర్కౌట్ కాకపోవడంతో ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించలేదు.

ఇక ధనుష్ కెరియర్ లో 50వ సినిమాగా వచ్చింది రాయన్. తన మైండ్ స్టోన్ సినిమా అవకాశాన్ని వేరొక దర్శకుడు ఇవ్వకుండా తనను తాను డైరెక్ట్ చేసుకున్నాడు ధనుష్. లేకపోతే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఎంతటి సక్సెస్ ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవానికి ఈ సినిమా మీద నిజంగా చాలామందికి నమ్మకం లేదు. కానీ ధనుష్ మీద ఉన్న అభిమానంతో ఈ సినిమా వర్కౌట్ అవుతుంది ఏదో సేఫ్ జోన్ లో ఉంటుంది అని అనుకున్నారు. అలా మినిమం అంచనాలతో వెళ్లిన ఆడియన్స్ అందరికీ కూడా ఈ సినిమా ఒక సప్రైజింగ్ ఫీల్ ని క్రియేట్ చేసింది.

Captain Miller

- Advertisement -

ఈ సినిమాతో ధనుష్ 100% సక్సెస్ అయ్యాడు అని చెప్పొచ్చు. ఒక నటుడుగా దర్శకుడుగా మంచి మార్కులను ఈ సినిమాతో సాధించుకున్నాడు ధనుష్. ఈ సినిమాలో ధనుష్ నటించిన విధానం సందీప్ కిషన్ క్యారెక్టర్ అపర్ణ బాలమురళి సెల్వరాఘవన్ ప్రకాష్ రాజ్ వంటి క్యారెక్టర్లకి ప్రాముఖ్యతను రాసిన విధానం ఇవన్నీ కూడా ఈ సినిమాలో అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ఈ సినిమాకి ప్రశంసలతో పాటు మంచి కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు వచ్చిన మూడు రోజులు కలెక్షన్స్ కూడా ఇంతకుముందు ధనుష్ కెరియర్ లో వచ్చిన కెప్టెన్ వెళ్లారు సినిమాను మించి ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం మూడు రోజుల్లో ముందు సినిమా కలెక్షన్స్ ను దాటడం అనేది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు