Race4 : హిట్ ప్రాంచైజీల్లో 4వ సీక్వెల్ రెడీ.. ఇందులో ఆ స్టార్ ఉంటాడా.. లేదా?

Race4 : బాలీవుడ్ లో సీక్వెల్ ఫ్రాంచైజీలకు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్క కమర్షియల్ సినిమా సూపర్ హిట్ అయిందంటే చాలు, అది ఎంత రొటీన్ గా ఉన్నా, దానికి సీక్వెల్ తీసి పడేస్తారు అక్కడి చిత్ర నిర్మాతలు, హౌస్ ఫుల్, గోల్ మాల్, రేస్, ఏ తా టైగర్, జాలి ఎల్ఎల్బి, సింగం ఇలా చెప్పుకుంటూ పోతే బాలీవుడ్ లో సీక్వెల్ సినిమాలు కోకొల్లలు, కొన్ని సార్లు అయితే ఆ సీక్వెల్ లో కొన్ని ప్లాప్ అయినా సరే మళ్ళీ సీక్వెల్స్ తీసేందుకు మేకర్స్ ట్రై చేస్తుంటారు. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో మరో సీక్వెల్ రెడీ అవుతుంది. బాలీవుడ్ లో యాక్షన్ సిరీస్ డ్రామాగా రేస్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమాకి ఇప్పటికే మూడు సీక్వెల్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ సిరీస్ లలో నాలుగో పార్ట్ తెరకెక్కడానికి రెడీ అవుతుంది. దీనిని ముందు సినిమాలు తీసిన చిత్ర నిర్మాతల్లో ఒకరైన రమేష్ తరాని ప్రకటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న రమేష్ తరాని రేస్ 4 (Race4) మూవీని కంఫర్మ్ చేసారు.

Race4 is ready as the 4th sequel of Race franchise in Bollywood

రేస్ 4 స్క్రిప్ట్ రెడీ?

ఇక బాలీవుడ్ లో రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న నిర్మాత రమేష్ తరాని రేస్ 4 కి సంబంధించిన స్క్రిప్ట్ రెడీ గా ఉందని త్వరలోనే ఈ సినిమాని కొత్త వాళ్ళతో ప్రారంభిస్తున్నామని అనౌన్స్ చేసాడు. ఇకపోతే రేస్ 4 సినిమాని స్వయంగా రమేష్ తరాని ఒక్కడే నిర్మిస్తున్నాడని టాక్ నడుస్తుంది. ఇదిలా ఉండగా రేస్ లో మొదటి రెండు పార్ట్ లు అబ్బాస్ మస్తాన్ డైరెక్ట్ చేయగా, మూడో పార్ట్ ని రెమో డిసౌజ్ డైరెక్ట్ చేసాడు. ఈ మూడు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఈ రేస్ పార్ట్ లో అనిల్ కపూర్ అన్ని పార్ట్ లలోనూ మెయిన్ లీడ్ గా నటించగా, మొదటి రెండు భాగాల్లో సైఫ్ అలీఖాన్ రెండో లీడ్ గా నటించగా, మూడో పార్ట్ లో సల్మాన్ ఖాన్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు. మూడో పార్ట్ సల్లూభాయ్ ఎంట్రీ తో అప్పట్లోనే 300 కోట్లకి పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు ఏకంగా నాలుగో పార్ట్ కి ముహూర్తం కుదిరింది.

- Advertisement -

నాలుగో పార్ట్ లో సల్లూభాయ్ ఉంటాడా?

అయితే నాలుగో సీక్వెల్ లో సల్లూభాయ్ ఉంటాడా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఎందుకంటే నాలుగో పార్ట్ లో నిర్మాత చెప్పినట్టు అంతా కొత్తవాళ్ళని తీసుకుంటున్నట్టు చెప్పాడు. మరి సల్మాన్ ఖాన్ ని కూడా తప్పిస్తారా? కొత్త స్టార్ ని దించుతారా అన్నది ఆసక్తిగా మారింది. కానీ సీక్వెల్ కి స్టార్ హీరోలు ఉంటె జనాలకు ఏమైనా ఆసక్తి వస్తుంది. అలాంటిది అంతా కొత్తవాళ్ళని దించితే ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందని నెటిజన్లు అంటున్నారు. ఏది ఏమైనా ఈ సీక్వెల్ సినిమాలు బాలీవుడ్ వాళ్ళకే సాధ్యం. సౌత్ వైపు మాత్రం ముందుగా కంటెంట్. కంటెంట్ లేకపోతే ఎంత స్టార్ కాంబో ఉన్నా ఇక్కడ పట్టించుకోరు. ఇక రేస్ పార్ట్ 4 ఆగష్టు లో మొదలయ్యే అవకాశం ఉందన్నారు నిర్మాత రమేష్ తరాని.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు