Raghava Lawrence : లారెన్స్ తెలుగులో “శ్రీకారం”… ఇది అంతా ఈజీగా అయ్యేది మాత్రం కాదు

Raghava Lawrence : రాఘవ లారెన్స్.. ఓ తమిళ నటుడు. కానీ, ఈయనను తెలుగు ఆడియన్స్ ఎప్పుడు కూడా పరభాష నటుడిలా చూడలేదు. దీనికి కారణం… ఆయన చేసే సినిమాలు, అభిమానుల్లో ఉన్న మంచి పేరు కూడా కావచ్చు. డాన్సర్ గా కెరీర్ స్టార్ట్ చేసి, కొరియోగ్రాఫర్ గా, ఆ పైన డైరెక్టర్ గా, ఆ తర్వాత ఏకంగా హీరోగా కూడా సక్సెస్ అయ్యి వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు కొరియోగ్రాఫర్ గా పెద్దగా సినిమాలు చేయకున్నా, హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇక తెలుగులో కూడా కాంచన ఫ్రాంచైజ్ లతో మంచి సక్సెస్ లు కొట్టాడు. అయితే తెలుగులో ఇప్పటివరకు రాఘవ లారెన్స్ డైరెక్ట్ సినిమా చేయలేదు. అడపా దడపా పలు సినిమాల్లో స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చాడు గాని, స్ట్రెయిట్ తెలుగు సినిమా అయితే చేయలేదు. అయితే ఇప్పుడు త్వరలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ఫిలిం నగర్ లో టాక్ నడుస్తుంది.

Raghava Lawrence movie with Telugu director B. Kishore coming soon

ఫైనల్ గా మరో తెలుగు సినిమాకు లారెన్స్ ఓకే?

ముని, కాంచన, శివ లింగ వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగులో కూడా సక్సెస్ కొట్టిన రాఘవ లారెన్స్ ఇక్కడ మార్కెట్ కూడా బాగానే సంపాదించాడు. కానీ ఇప్పటివరకు తెలుగు సినిమా చేయలేదు. అయితే లేటెస్ట్ గా ఓ తెలుగు దర్శకుడు చెప్పిన కథకు లారెన్స్ ఒకే చేసాడని వార్తలు వస్తున్నాయి. మూడేళ్ళ కింద శర్వానంద్ హీరోగా శ్రీకారం అనే సినిమా తీసిన దర్శకుడు బి కిషోర్ రాఘవ లారెన్స్ కి కథ వినిపించాడట. ఆ కథ లారెన్స్ కి బాగా నచ్చి వెంటనే ఒకే చేశారట. స్క్రిప్ట్ డెవెలెప్మెంట్ కాస్త ఉంటుంది అంతే అన్నారు. అతి త్వరలోనే ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉందట.

- Advertisement -

ఇక రాఘవ లారెన్స్ బి. కిషోర్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే ఈ సినిమాను హాస్య మూవీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత రాజేష్ దండా నిర్మిస్తారని సమాచారం. దీనిపై అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. ఇక లారెన్స్ ప్రస్తుతం తమిళ్ లో జిగర్ తండా డబుల్ ఎక్స్ తో మంచి సక్సెస్ ని అందుకోగా, ప్రస్తుతం దుర్గ, అదిగారం అనే సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తవగానే కిషోర్ తో సినిమా అనౌన్స్ చేస్తారని సమాచారం. మరి ఈ వార్తలు నిజమైతే రాఘవ లారెన్స్ కి తెలుగులో మరింత మార్కెట్ పెరగడం ఖాయమని చెప్పొచ్చు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు