Rajamouli: మరోసారి ఆలియా భట్?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా SSMB29. కెరీర్ లో ఒక్క అపజయం లేకుండా.. వరుసగా పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తూ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఈ చిత్రం రానుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఆఫ్రికా అడవుల్లో ఈ చిత్రం ఉంటుందని, ప్రపంచ స్థాయి అడ్వెంచర్ గా ఈ చిత్రం తెరకెక్కింబోతున్నట్టు జక్కన్న ఇప్పటికే ప్రకటించారు. అంతే కాకుండా.. ఫ్రాంచైజీ గా రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. అయితే ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ముందుగా ఈ చిత్రంలో మహేష్ కు జోడీగా బాలీవుడ్ పొడుగు కాళ్ల సుందరి దీపికా పదుకొణె ను ఎంపిక చేశారని వార్తలు వచ్చాయి.

తాజాగా మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. బాలీవుడ్ వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఆలియా భట్ ను ఈ చిత్రంలో రాజమౌళి తీసుకోబోతున్నారట. ఆలియా ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో నటించిన సంగతి విధితమే. ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీ స్టారర్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఆలియా భట్ ఓ పాత్ర చేసింది. అయితే ఆ పాత్ర నిడివి చాలా చిన్నదిగా ఉండటంతో.. మరోసారి పెద్ద పాత్రను ఆలియాతో చేయించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట.

- Advertisement -

అయితే ఈ వార్తలు పక్క రూమర్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే SSMB29 ఫైనల్ స్క్రిప్ట్ కూడా పూర్తి కాలేదు. ప్రస్తుతం పాత్రల ఎంపిక ప్రక్రియ కూడా స్టార్ట్ కాలేదు. కాస్ట్ అండ్ క్రూ విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుని రాజమౌళి ఈ చిత్రానికి నటీ నటుల ఎంపిక విషయంలో మరింత సమయం తీసుకోవచ్చు. కాగా ప్రస్తుతం మహేష్ SSMB28 ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇది పూర్తి అయిన తర్వాత SSMB29 ప్రారంభమవుతుంది. దానికి ఇంకా చాలా టైం ఉందని చెప్పొచ్చు. అప్పటి వరకు ఈ చిత్రం గురించి అనేక రకాలుగా రూమర్స్ వస్తాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు