SSMB29 : మహేష్ కోసం ఆ హీరోయిన్ ను దింపబోతున్న రాజమౌళి.. ఫ్యాన్సూ ఇక రెడీ అవ్వండమ్మా..

SSMB29 : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) ఈ ఏడాది “గుంటూరు కారం”(Guntur Karam ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా అనుకున్న హిట్ టాక్ ను అందుకోలేదు కానీ సాంగ్స్ బాగా ట్రెండ్ అయ్యాయి. ఈ సినిమా వచ్చింది 8 నెలలు అయిన కూడా ఇప్పటికి సాంగ్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఎనిమిది నెలలు పూర్తి అయినా కూడా మహేష్ బాబు కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వక పోవడం పై ఆయన ఫ్యాన్స్ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి ( Rajamouli ) దర్శకత్వంలో 29 వ సినిమాను చెయ్యబోతున్నట్లు ఎప్పుడో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. ఈ మూవీను ఎప్పుడు మొదలు పెడతారా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. అయితే జక్కన్న మాత్రం అదిగో ఇదిగో అని ఊరిస్తూ వస్తున్నాడు.. కానీ సినిమా షూటింగ్ ను మాత్రం మొదలు పెట్టలేదు..

తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో మహేష్ కు హీరోయిన్ ఎవరన్నదానిపై ఓ వార్త చక్కర్లు కొడుతుంది. SSMB29 సినిమాను ప్రకటించి చాలా కాలం అయ్యింది. కానీ ఇప్పటివరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులను మాత్రమే పూర్తి అయ్యాయి కానీ సినిమాకు ఇంకా కొబ్బరికాయ మాత్రం కొట్టలేదు.. కనీసం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఈలోగా రకరకాల విషయాలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా క్యాస్టింగ్ కి సంబంధించి అప్డేట్స్ అసలు రాజమౌళికైనా తెలుసో లేదో కానీ తెరపైకి మాత్రం రకరకాల స్టార్ హీరోల, హీరోయిన్ల పేర్లు నెట్టింట వినిపిస్తున్నాయి. ఇప్పుడు హీరోయిన్ ఈమె అంటూ ఓ వార్త షికారు చేస్తుంది.

Rajamouli is going to drop that heroine for Mahesh
Rajamouli is going to drop that heroine for Mahesh

ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ( Pruthviraj Sukumaran ) విలన్ గా చేస్తున్నాడంటూ ప్రచారం చేశారు. ఆ తర్వాత తంగలాన్ ఈవెంట్లో విక్రమ్ మాటలను బట్టి కన్ఫర్మేషన్ లేకుండానే ఆయన కూడా ఈ సినిమాలో ఉన్నారని నిర్ధారణకు వచ్చారు. అంతేకాదు దీపిక, మోహన్లాల్, నాగార్జున కూడా ఈ లిస్టులోకి జమ అయ్యారు. అలాగే ఒక అడుగు ముందుకేసి హీరోయిన్ గా చెస్లియా ఇస్లాన్ ఇప్పటికే ఆన్ బోర్డు కు వచ్చేసిందని, ఏకంగా ఫ్యాన్ మేడ్ పోస్టర్లు కూడా తయారు చేయించి మరీ వైరల్ చేస్తున్నారు. ఇక మహేష్ బాబు బర్త్ డే సందర్బంగా ఒక్క పోస్టర్ కూడా రిలీజ్ చెయ్యలేదు.. ఎయిర్పోర్ట్, ప్రైవేట్ ఈవెంట్స్ లో బయటకి వస్తున్న మహేష్ బాబు కొత్త లుక్స్ చూసి అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు అయితే మరొకవైపు గరుడ అనుకుంటున్నారు కానీ ఇంకా క్లారిటీ లేదు. ఈ సినిమాలో పలువురు హాలీవుడ్ స్టార్స్ కూడా నటించనున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాను కెఎల్ నారాయణ నిర్మిస్తున్నారు.. సెప్టెంబర్ సెకండ్ వీక్ లో అప్డేట్ రానుందని సమాచారం..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు