SSMB29 : మహేష్ బాబు ఫ్యాన్స్ కు షాకిచ్చిన రాజమౌళి.. సినిమా క్యాన్సిల్ అయ్యిందా?

SSMB29 : తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా వచ్చి ఏడాది అవుతున్నా మరో సినిమా రాకపోవడంతో ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఏడాదికి ఒక సినిమాతో ప్రేక్షకులను పలకరించే సూపర్ స్టార్ మహేష్ ఇప్పటివరకు కొత్త సినిమా గురించి అప్డేట్ ఇవ్వకపోవడం పై ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి (Rajamouli) తో సినిమా చేస్తున్నాడు. ఆ డైరెక్టర్ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా రావడానికి రెండు, మూడేళ్లు తీసుకుంటుంది. ఇక ఈ సినిమా కూడా అంతే టైం పట్టొచ్చు. ఈ కాంబోలో మూవీని అనౌన్స్ చేసి దాదాపు ఏడాది అయిన కూడా ఇంక సెట్స్ మీదకు వెళ్లలేదు.. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వినిపిస్తుంది.

ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఎప్పుడో పూర్తి అయ్యిందని రైటర్ విజేంద్ర ప్రసాద్ (Vijendra Prasad) చాలాసార్లు చెప్పాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఎప్పుడో పూర్తి అయ్యాయి. ఇక కోసం లొకేషన్స్ ను కూడా సెట్ చేసుకున్నారు. కానీ ఇప్పటివరకు దీని షూటింగ్ అప్డేట్ ను జక్కన్న ఇవ్వలేదు. కనీసం మహేష్ బర్త్ డే సందర్బంగా ఈ సినిమా నుంచి పోస్టర్ వస్తుందని ఫ్యాన్స్ ఎక్సఫెక్ట్ చేశారు. అది కూడా లేదు. ఇటీవల సెప్టెంబర్ మొదటి వారంలో సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని వార్తలు ఇండస్ట్రీలో వినిపించాయి. కానీ సినిమాకు కొబ్బరికాయ కూడా జక్కన్న కొట్టలేదు. మరి సినిమా అసలు ఉందా? అనే అనుమానాలు ఫ్యాన్స్ లో మొదలయ్యాయి. మరోవైపు సినిమా క్యాన్సిల్ అయ్యిందని, త్వరలోనే మరో డైరెక్టర్ తో మహేష్ కొత్త సినిమాను అనౌన్స్ చెయ్యనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ టాపిక్ అయ్యింది..

Rajamouli shocked Mahesh Babu fans.. Has the movie been cancelled?
Rajamouli shocked Mahesh Babu fans.. Has the movie been cancelled?

ఇక ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో మొదలు కాబోతుందని వార్త రాజమౌళి సన్నిహిత వర్గాల్లో వినిపిస్తుంది. 2025 సంక్రాంతికి సినిమాను హాఫ్ పూర్తి చేసే ప్లాన్ లో ఉన్నారని టాక్.. ఈలోపు సైన్ చేసిన కమర్షియల్ పనులన్ని పూర్తి చేసేసుకుంటున్నాడు మహేష్. దీంతోపాటే ఫ్యాన్స్ మీట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారట సూపర్ స్టార్. రాజమౌళి సినిమా సెట్స్‌ పైకి రాకముందే ఫ్యామిలీ టైం ఫుల్ గా ఎంజాయ్ చేసేస్తున్నాడు. మహేష్ హాలిడేస్ కు వెళ్తూ పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నాడు. ఒకసారి రాజమౌళి మూవీ షూట్ మొదలైతే.. అందులోంచి బయటకు రావడం అసాధ్యం. పైగా మూడేళ్ల తర్వాత కానీ తన నుంచి సినిమా ఆడియన్స్ కు రాదు. అందుకే ఫ్యాన్స్ ని కలిసి సలహాలు సూచనలు తీసుకుంటున్నాడట. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరాకెక్కిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు