Rajasekhar : కొత్త సినిమా కోసం కల్ట్ టైటిల్ ని రిపీట్ చేస్తున్న యాంగ్రీ యంగ్ మెన్..

Rajasekhar : టాలీవుడ్ యాంగ్రీ మ్యాన్ రాజా శేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు యాక్షన్ హీరోగా టాలీవుడ్ లో 90స్ లో ఒక ఊపు ఊపిన హీరో 20స్ తర్వాత చల్లబడ్డాడు. వరుస పరాజయాలు ఈయన్ని కోలుకోకుండా చేసాయి. ఇక తన తోటి హీరోలు శ్రీకాంత్, జగపతిబాబు వంటి వారు కూడా ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు గా విలన్లు గా మారి, బిజీ అవుతున్నారు. కానీ రాజశేఖర్ మాత్రం హీరోగానే ఇంకా సినిమాలు చేయాలనీ ట్రై చేస్తున్నాడు. ఆ మధ్య మంచి బలమైన పాత్ర వస్తే విలన్ గానూ చేయడానికి సిద్ధం అని చెప్పుకొచ్చాడు. గరుడ వేగతో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన రాజశేఖర్ (Rajasekhar) ఆ సినిమాతో యావరేజ్ మూవీని అందుకోగా, తర్వాత వచ్చిన సినిమాలు ఒక్కటి కూడా ఆకట్టుకోలేకపోయాయి.

Rajasekhar latest movie title as Magadu

రీ ఎంట్రీ లో సక్సెస్ కోసం విశ్వ ప్రయత్నాలు..

ఇక రీసెంట్ టైంలో లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో నితిన్ హీరోగా నటించిన ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మెన్’ (Extra Ordinary man) లో స్పెషల్ రోల్ చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయినా సరే ఇప్పటికి హీరోగా నిలదొక్కుకోవాలని రాజశేఖర్ భావిస్తున్నాడు. ప్రస్తుతం ఓ మంచి కాన్సెప్ట్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్లాన్ చేస్తున్నాడు రాజశేఖర్. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ చిత్రంతో దర్శకుడిగా మెప్పించిన యువ దర్శకుడు పవన్ సాధినేని (Pawan sadhineni) తో రాజశేఖర్ త్వరలో ఓ యాక్షన్ సినిమా చేయనున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం రాజశేఖర్ తన క్లాసిక్ టైటిల్ ని రిపీట్ చేయనున్నాడని సమాచారం.

- Advertisement -

కల్ట్ టైటిల్ ని రిపీట్ చేయనున్న యాంగ్రీ యంగ్ మెన్..

ఇక డైరెక్టర్ పవన్ సాధినేని లాస్ట్ ఇయర్ జేడి చక్రవర్తి తో “దయ” వెబ్ సిరీస్ అలాగే రాజశేఖర్ తో సేనాపతి చేసాడు. ఇప్పుడు రాజశేఖర్ తో పవర్ ఫుల్ ఆక్షన్ సినిమా తీయడానికి రెడీ అయ్యాడు. అందుకే ఈ సినిమాకు ఓ పవర్ ఫుల్ టైటిల్ ని ఫిక్స్ చేసారని టాక్. దీనికోసం రాజశేఖర్ గతంలో వచ్చిన తన సూపర్ హిట్ సినిమా టైటిల్ ని మళ్ళీ రిపీట్ చేస్తునట్టు తెలుస్తుంది. రాజశేఖర్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో “మగాడు” (Magadu) ఒకటి. అప్పట్లో యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ అయింది. ఇప్పుడు “మగాడు” టైటిల్ ని మళ్ళీ పవన్ సాధినేని సినిమా కోసం వాడుతున్నట్టు సమాచారం. దీనిపై చిత్ర యూనిట్ నుండి కన్ఫర్మేషన్ రావాల్సి ఉంటుంది. చాలా ఏళ్లుగా హిట్ అండ్ సరైన కం బ్యాక్ కోసం ఎదురు చూస్తున్న రాజశేఖర్ కి ఈ సారి మంచి కంబ్యాక్ వచ్చే అవకాశం కనిపిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు