Rajinikanth: అబుదాబి వెళ్లిన రజినీకాంత్… అక్కడేం పనంటే?

Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం నటిస్తున్న మూవీ వెట్టాయన్ షూటింగ్ అయిపోగానే అబుదాబికి బయలుదేరారు. ఆయన ఎయిర్ పోర్ట్ లో కెమెరాల కంటికి చిక్కగా, ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. మరి రజనీకాంత్ కి అసలు అబుదాబిలో ఏం పని? అంటే…

రజిని అబుదాబి ఎందుకు వెళ్లారంటే?

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం వెట్టాయన్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. అయితే మూవీ షూటింగ్ పూర్తి కాగానే రజనీకాంత్ అబుదాబికి ప్రయాణమయ్యారు. దీంతో ఆయన అక్కడికి వెళ్లడానికి గల కారణం ఏంటి అని ఆరా తీయడం మొదలుపెట్టారు అభిమానులు. కానీ ఇప్పటిదాకా రజనీకాంత్ అబుదాబికి ఎందుకు వెళ్లారు అనే విషయంపై స్పష్టమైన కారణం తెలియ రాలేదు.

తాజా సమాచారం మేరకు రజనీకాంత్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవడానికి అబుదాబికి ట్రిప్ వెళ్లారని అంటున్నారు. చెన్నై విమానాశ్రయం నుంచి ఆయన అబుదాబికి వెళ్తుండగా తీసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాదాపు ఆయన వారం రోజులపాటు అబుదాబిలో విశ్రాంతి తీసుకోబోతున్నట్టు సమాచారం. ఆ తర్వాత రజనీకాంత్ తిరిగి వచ్చి కూలి మూవీ షూటింగ్ లో బిజీ కాబోతున్నారు. కూలీ మూవీ షూటింగ్ కోసం ఆయన భారీ కాల్షిట్స్ ఇచ్చారని, మూవీ షూటింగ్ పూర్తయ్యే వరకు బిజీగా ఉండబోతున్నారని టాక్ నడుస్తోంది.

- Advertisement -

కూలీగా రజినీకాంత్

రజనీకాంత్ నెక్స్ట్ కూలి అనే మూవీలో నటించబోతున్నారన్న విషయం తెలిసిందే. క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. రజనీకాంత్ కెరీర్ లో 171 మూవీగా తెరకెక్కుతున్న కూలీ మూవీ గురించి సౌత్ ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. రీసెంట్ గా ఈ మూవీ టైటిల్ టీజర్ రిలీజ్ కాగా, దానికి అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. ఈ మాస్ యాక్షన్ చిత్రం తమిళనాడులోని ఓడరేవు ద్వారా ఓ బృందం బంగారాన్ని స్మగ్లింగ్ చేయడం గురించి ఉంటుందని తెలుస్తోంది. వాస్తవానికి లోకేష్ గత సినిమాలు కూడా డ్రగ్స్ నేపథ్యంలో సాగినవే. ఇందులో రజనీకాంత్ కూలీ పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. ఇక తరచుగా లోకేష్ సినిమాలలో కనిపించే సస్పెన్స్ ఈ సినిమాలో కూడా ఉండబోతుందని ఆశిస్తున్నారు అభిమానులు.

సూపర్ స్టార్ రజనీకాంత్ 171వ సినిమా అయిన కూలీ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధిమారన్ నిర్మిస్తున్నారు. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. మలయాళ సినిమాటోగ్రాఫర్ గిరీష్ గంగాధరన్ ఈ చిత్రానికి కెమెరాను హ్యాండిల్ చేయనున్నారు. ఈ సినిమా తమిళంలోనే కాకుండా హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో కూడా విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

వెట్టాయన్ షూటింగ్ జెట్ స్పీడ్ లో

వెట్టాయన్ వాస్తవ కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం. టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ‘వెట్టాయన్’లో రజనీకాంత్ టైటిల్ రోల్‌ నటిస్తుండగా, ఇదొక యాక్షన్ డ్రామాగా రాబోతోంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్, దుషార విజయన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ను జెట్ స్పీడ్ తో పూర్తి చేశారు రజిని.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు