Rajinikanth : న్యూ ఇయర్ కే వస్తున్నాడా ?

సూప‌ర్ స్టార్ ర‌జినికాంత్ తాజాగా ‘జైల‌ర్’ చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ ఏడాది ఆగ‌స్టులో  సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమాలో ర‌జినికాంత్‌తో పాటు శివ‌రాజ్ కుమార్‌, ర‌మ్య‌కృష్ణ వంటి న‌టీ,న‌టులు న‌టిస్తున్నారు. గ‌తంలో ర‌జినికాంత్‌-ర‌మ్య‌కృష్ణ కాంబోలో వ‌చ్చిన ‘న‌ర‌సింహ’ సినిమా సూప‌ర్ హిట్ విష‌యం విధిత‌మే.  జైల‌ర్ మూవీకి నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ర‌జినీకాంత్ హీరోగా 2020లో ద‌ర్బార్, 2021లో వ‌చ్చిన పెద్ద‌న్న సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద అంత‌గా ఆక‌ట్టుకోలేద‌నే చెప్ప‌వ‌చ్చు. ‘జైల‌ర్’ సినిమాలో ర‌జినికాంత్ కాస్త కొత్త‌గా క‌నిపించ‌బోతున్నట్టు ఇప్ప‌టికే చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఈ చిత్రంలో కామెడీతో పాటు కొన్ని స‌స్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉండ‌నున్న‌ట్టు స‌మాచారం. తాజాగా జైల‌ర్ సినిమాని ఏప్రిల్ 14న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు చిత్ర‌బృందం నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా ఏప్రిల్ 14 త‌మిళ న్యూ ఇయ‌ర్ కావ‌డంతో సెంటిమెంట్ కూడా క‌లిసి రానుంద‌ని.. జైల‌ర్ భావించిన‌ట్టు స‌మాచారం. ర‌జిని సినిమాలను ఎక్కువ‌గా ఏప్రిల్ 14న విడుద‌ల చేస్తారు. సినిమా విడుదలకు సాధ్యం కాకుంటే.. కనీసం ట్రైలర్ ను అయినా ఆ డేట్ ను విడుదల చేస్తారు. ఇక మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏంటంటే ఈ చిత్రంలో త‌మిళ హీరో శివ కార్తికేయ‌న్ కూడా ఒక గెస్ట్ రోల్‌ని చేయ‌బోతున్నాడు. రోబో సినిమా త‌రువాత ర‌జినీ ఖాతాలో ఒక్క సినిమా కూడా భారీ హిట్ ప‌డ‌లేదు. మ‌రి ఈ సారైనా సూప‌ర్ స్టార్ బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేస్తాడా లేదా అనేది ఈ సినిమా విడుదల అయ్యేంత వరకు వేచి చూడాలి.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు