Rakshasa Raja Update : రాక్షస రాజా కోసం హీరోయిన్ ఫిక్స్… ఆ పాన్ ఇండియా హీరోయిన్ తో ప్రయోగం

Rakshasa Raja Update : రానా దగ్గుబాటి చాలా కాలం గ్యాప్ తర్వాత చేస్తున్న కొత్త సినిమా రాక్షస రాజా. మూవీని ప్రకటించి చాలా రోజులే అవుతోంది. కానీ ఇంకా ముందుకు కదలకపోవడంతో ఒక్క అప్డేట్ కూడా బయటకు రాలేదు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అనే వార్త బయటకు వచ్చింది. ఇందులో ఓ పాన్ ఇండియా హీరోయిన్ ను రానా సరసన హీరోయిన్ గా ఫిక్స్ చేశారట మేకర్స్. మరి ఆ బ్యూటీ ఎవరు ? అనే వివరాల్లోకి వెళ్తే..

రాక్షస రాజాకు రాణి ఫిక్స్ ?

రానా దగ్గుబాటి, దర్శకుడు తేజ గతంలో చేసిన నేనే రాజు నేనే మంత్రి మూవీ కమర్షియల్ గా విజయం సాధించింది. వీరిద్దరి కాంబినేషన్ లో కొన్ని రోజుల క్రితమే ఓ ప్రాజెక్టు ను అనౌన్స్ చేశారు. రానా పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ రానా హీరోగా, తేజ దర్శకత్వంలో రూపొందనున్న రాక్షస రాజా అనే మూవీని అధికారికంగా ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం దర్శకుడు తేజ ఈ పొలిటికల్ డ్రామా కోసం హీరోయిన్ ను లాక్ చేసాడని తెలుస్తోంది. రానా దగ్గుబాటి సరసన కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి జత కట్టనుంది అని టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా ఆగాల్సిందే.

అయితే ఈ ప్రాజెక్టులోకి శ్రీనిధి శెట్టిని తీసుకోవడం అంటే నిజంగానే సాహసం అని చెప్పాలి. అసలే రానా సినిమాల విషయంలో చాలా గ్యాప్ వచ్చింది. ఇక మరోవైపు శ్రీనిధికి కేజీఎఫ్ తరువాత పెద్దగా అవకాశాలు లేవు. మరి ఆమెను హీరోయిన్ గా తీసుకుంటే ఎంత వరకు వర్కౌట్ అవుతుందో ? సినిమాకు ఏ రకంగా హెల్ప్ అవుతుందో?

- Advertisement -

EXCLUSIVE | Srinidhi Shetty: 'I want to be part of movies where my character has a lot of scope to perform and showcase my acting skills'

మరో హీరోయిన్ పేరు తెరపైకి

ఇంతకుముందు ఇదే సినిమాలో హీరోయిన్ అంటూ మరో హీరోయిన్ పేరు విన్పించింది. కాగా కొన్ని రోజుల నుంచి ఈ రాక్షస రాజా కోసం డైరెక్టర్ హీరోయిన్ల వేటలో ఉన్న డైరెక్టర్ తేజ “చిలసౌ” సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన టాలెంటెడ్ బ్యూటీ రుహాని శర్మను హీరోయిన్ గా ఎంపిక చేశాడని రూమర్ వచ్చింది. నిజానికి రాక్షస రాజా కోసం ఇద్దరు అగ్ర తారలను ఆడిషన్ చేశారట. సినిమా బడ్జెట్ కారణమో, లేదంటే మరే ఇతర కారణమో తెలియదు గాని వాళ్లను పక్కన పెట్టేసి మొత్తానికి రుహనీని ఫిక్స్ చేశారని అన్నారు. ఇప్పుడేమో శ్రీనిధి శెట్టి ఫిక్స్ అంటున్నారు.

రాక్షస రాజా షూటింగ్ ఎప్పుడు ?

ప్రస్తుతం ముంబైలో రానా నాయుడు సీజన్ 2 షూటింగ్‌లో బిజీగా ఉన్న రానా త్వరలోనే రాక్షస రాజా షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ సినిమాతో 45 మంది కొత్త ఆర్టిస్టులను పరిచయం చేసేందుకు తేజ ప్లాన్ చేస్తున్నాడు. ఇదొక గ్యాంగ్‌స్టర్ డ్రామా జానర్‌లో తెరకెక్కనున్న యాక్షన్ ఎంటర్‌టైనర్. రానా కోసం తేజ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ని డిజైన్ చేశాడని అంటున్నారు. అందుకే మూవీ షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్. అతి త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు