Indian2 : టాలీవుడ్ స్టార్ హీరోల అభిమానుల్లో ఇప్పుడు అందరికంటే ఎక్కువ నిరాశలో ఉంది రామ్ చరణ్ ఫ్యాన్స్ అనే చెప్పాలి. మూడేళ్ళుగా రామ్ చరణ్ సినిమా గేమ్ ఛేంజర్ కోసం నిరీక్షిస్తూనే ఉన్నారు. లాస్ట్ ఇయర్ లోనే రిలీజ్ కావాల్సిన సినిమా శంకర్ ఇండియన్2 వల్లే వాయిదా పడిందని తెలిసిందే. నిజం చెప్పాలంటే ఇప్పుడు శంకర్ గేమ్ ఛేంజర్ ని పక్కన పెట్టి ఇండియన్ 2 పై ఫోకస్ పెడుతుండడం పై చరణ్ అభిమానులకి అస్సలు మింగుడు పడడం లేదు. ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే చిరాకు పుట్టిస్తుందని చెప్పాలి. కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ 2 సినిమా విడుదల కోసం కమల్ ఫ్యాన్స్ కంటే చరణ్ ఫ్యాన్స్ చాలా వెయిట్ చేస్తున్నట్టు పరిస్థితి మారింది. ఎందుకంటే ఆ సినిమా విడుదలైతే గాని రామ్ చరణ్ యొక్క గేమ్ ఛేంజర్ పై శంకర్ దృష్టి పెట్టేలా లేడు. ఇక ఇండియన్ 2 సినిమా అయితే అప్పుడెప్పుడో ఆరేళ్ళ కిందట సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. కొన్ని కారణాల వల్ల సినిమా ఆగిపోతే, చరణ్ సినిమా మొదలుపెట్టాడు శంకర్. తిరిగి ఇండియన్2 కి సంబంధించిన సమస్యలు తొలగిపోగానే ఆ సినిమాపై దృష్టి పెట్టాడు.
చరణ్ ఫ్యాన్స్ కి కోపం తెప్పిస్తున్న శంకర్..
అయితే సినిమాల విషయంలో ఎప్పుడూ ప్లానింగ్ లో ఉండే దర్శకుడు శంకర్ ఇండియన్2 ప్రాజెక్ట్ ను వదిలేసి రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ ను మొదలు పెట్టాడని అంతా అనుకున్నారు. కానీ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ సినిమాను చేస్తున్న సమయంలోనే దర్శకుడు శంకర్ మళ్లీ ఇండియన్ 2 సినిమాను పునః ప్రారంభించాడు. ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సిన గేమ్ చేంజర్ ను కనీసం షూటింగ్ కూడా ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. అందుకు కారణం ఇండియన్ 2 అనే విషయం అందరికి తెలిసిందే. ఇండియన్ 2 సినిమా విడుదల అయిన తర్వాతే గేమ్ చేంజర్ సినిమా విడుదల విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొన్నటి వరకు జూన్ 13న ఇండియన్ 2 ను విడుదల చేస్తామంటూ యూనిట్ సభ్యులు ప్రచారం చేశారు. కానీ ఎన్నికల హడావుడి మరియు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి అవ్వక పోవడంతో ఇండియన్ 2 ను జులై 12 కు వాయిదా వేశారు. అయినా సరే కొత్త విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్ పై ఫ్యాన్స్ నమ్మకం వ్యక్తం చేయడం లేదు. జులై 12న సినిమా విడుదల చేస్తామని లైకా ప్రొడక్షన్స్ వారు ప్రకటించినా కూడా ఆ తేదీకి అయినా వస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పదే పదే విడుదల తేదీలను మార్చుతున్న ఇండియన్ 2 మేకర్స్ పై రామ్ చరణ్ ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ 2 సినిమా విడుదల అయితే తప్ప దర్శకుడు శంకర్ గేమ్ చేంజర్ ని పూర్తి చేసే పరిస్థితి లేదు.
చరణ్ రంగంలోకి దిగాల్సిందే..
అయితే ఇన్ని రోజులు రామ్ చరణ్ కూడా శంకర్ ని బలవంత పెట్టలేదు. కానీ పరిస్థితి చూస్తుంటే ఇండియన్2 (Indian2) విడుదలయ్యే దాకా గేమ్ ఛేంజర్ ని పూర్తిగా పక్కనబెట్టేటట్టు శంకర్ వ్యవహారం కనిపిస్తుంది. పైగా ఇండియన్2 నుండి ప్రమోషన్లు కూడా మొదలుపెట్టలేదు. అంటే సినిమా రిలీజ్ పై కన్ఫర్మేషన్ లేదనే అనుమానం వస్తుంది. ఏది ఏమైనా గేమ్ ఛేంజర్ షూటింగ్ మాత్రం ఆగడానికి వీల్లేదని దిల్ రాజు అనుకుంటున్నాడట. అందుకే రామ్ చరణ్ తోనే నచ్చచెప్పే ప్రయత్నం దిల్ రాజు చేస్తున్నాడని సమాచారం. ఏది ఏమైనా గేమ్ ఛేంజర్ లేటవుతున్న కొద్దీ ఆడియన్స్ లోనూ అంచనాలు తగ్గిపోతున్నాయి. రామ్ చరణ్ కూడా వేరే సినిమా స్టార్ట్ చేయలేదు. అందుకే ఎప్పుడెప్పుడు ఇండియన్ 2 వస్తుందా అంటూ చరణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇండియన్ 2 రిలీజ్ అయిపోతే శంకర్ గేమ్ చేంజర్ పై ఫోకస్ పెట్టేస్తాడు. ఇక జులై లోగా ఇండియన్ 2 రిలీజ్ అయితే, ఈ ఏడాది ముగిసే లోగా రామ్ చరణ్ “గేమ్ చేంజర్” ఇదే ఏడాది రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.