Ram Charan: దర్శకుడు శంకర్ నుంచి చరణ్ కి విముక్తి రానుందా?

దర్శకుడు శంకర్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు డబ్బింగ్ సినిమాలు ద్వారా ఎప్పటినుంచో దర్శకుడు శంకర్ పరిచయం ఉన్నారు. శంకర్ నుంచి ఒక సినిమా వస్తుందంటే ఎన్నో అంచనాలు నెలకొంటాయి. తెలుగులో ఒకే ఒక్కడు సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శంకర్ ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించారు. శంకర్ దర్శకత్వంలో సినిమా చేయాలని చాలామంది స్టార్ హీరోలు కలలు కనేవారు. వారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు.

శంకర్ దర్శకత్వంలో సినిమా చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు మెగాస్టార్ చిరంజీవి. కానీ ఆ అవకాశం మాత్రం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కు దక్కింది. రామ్ చరణ్ తేజ్ గురించి మాట్లాడుకుంటే రంగస్థలం ముందు రంగస్థలం తర్వాత అని చెప్పొచ్చు. రంగస్థలం సినిమా కంటే ముందు చరణ్ కెరియర్లో మంచి హిట్ సినిమాలు ఉన్నాయి. కానీ రంగస్థలం సినిమా చరణ్ ని వేరే లెవెల్ లో నిల్చోబెట్టింది. అసలు చరణంలో ఇంత టాలెంట్ ఉంది అని రంగస్థలం సినిమా ప్రూవ్ చేసింది.

రంగస్థలం సినిమా తర్వాత చరణ్ స్థాయి అమాంతం పెరిగిపోయింది. చరణ్ నుంచి ఒక సినిమా వస్తుంది అని అంటే ప్రేక్షకులకి అంచనాలు కూడా పెరిగిపోతాయి. ఆ సినిమా తర్వాత వచ్చిన వినయ విధేయ రామ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.ఆ సినిమా డిజాస్టర్ అయిన కూడా ఆ ఎఫెక్ట్ ఏమీ చరణ్ పై పడలేదు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా మనం చర్చించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఆ సినిమాని వీక్షించి ఆ సినిమాకి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చింది.

- Advertisement -

ఆ సినిమాలో చరణ్ చూపించిన విధానం, చరణ్ నటించిన తీరు ప్రేక్షకులకి విపరీతంగా ఆకట్టుకుంది. గేమ్ చేంజర్ ఆ సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో, అది కూడా శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమా మార్చి ఎండ్ కి రామ్ చరణ్ షూటింగ్ పోర్షన్ కంప్లీట్ అవుతున్నట్లు తెలుస్తుంది.

రామ్ చరణ్ పోర్షన్ షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఈ సినిమా మరో 50 రోజులు షూటింగ్ జరుపుకోవాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కూడా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు ఇదివరకే లీకైన కొన్ని ఫోటోలు ద్వారా కొంతమేరకు క్లారిటీ వచ్చింది. ఏదేమైనా మొత్తానికి ఇండియన్ 2 ను కొంచెం పక్కన పెట్టి మళ్ళీ చరణ్ సినిమాలను పట్టాలెక్కిస్తున్నందుకు చరణ్ అభిమానులకి కొంచెం ఆనందంగా ఉందని చెప్పొచ్చు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు