Ram Charan: గేమ్ చేంజర్ సమ్మర్ కి కూడా కష్టమేనా..?

RRR సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో గేమ్ చెంజర్ సినిమా షూటింగ్ చాలా కాలం కిందట మొదలైన సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాతగా భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఈ సినిమా కోసం ఫ్యాన్స్ మాత్రమే కాకుండా నార్మల్ ఆడియెన్స్ కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఆ మధ్య షూటింగ్ స్పాట్ నుండి లీకైన స్టిల్స్ లో రామ్ చరణ్ లుక్స్ ఆకట్టుకోవడంతో సినిమా మీద మరింత ఆసక్తి పెరిగింది. అయితే, శంకర్ ఈ సినిమాతో పాటు ఇండియన్ 2 సినిమా మీద సైమల్టేనియస్ గా కాన్సంట్రేట్ చేయటం వల్ల ఈ పతికి రిలీజ్ కావల్సిన ఈ సినిమా డిలే అయ్యింది.

రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను 2024 సమ్మర్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది సినిమా యూనిట్. ఇదిలా ఉండగా ఈ సినిమా వచ్చే సమ్మర్  కి రిలీజ్ అవ్వటం కూడా కష్టమే అని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ని పది రోజుల పాటు ఆపేస్తూ యూనిట్ నిర్ణయం తీసుకోవటమే ఇందుకు కారణం.

- Advertisement -

ఇటలీలో జరగనున్న వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల మ్యారేజ్ కి రామ్ చరణ్ అటెండ్ అవుతున్న నేపథ్యంలో షెడ్యూల్ ని పోస్ట్ పోన్ చేసినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా రిలీజ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అనిపిస్తోంది. అసలే సినిమా డిలే అవుతుందన్న నిరాశలో ఉన్న మెగా ఫ్యాన్స్ కి ఈ న్యూస్ మరింత నిరాశకు గురి చేసిందనే చెప్పాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు