Ram Charan: చెర్రీ కోసం కృష్ణవంశీ అలాంటి పని.. ఫ్యాన్స్ లో ఆందోళన..!

Ram Charan .. నిన్నే పెళ్ళాడతా వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రముఖ డైరెక్టర్ కృష్ణవంశీ గురించి, ఆయన టేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో అద్భుతమైన చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి మరింత విజయాన్ని సొంతం చేసుకున్నారు… ఇదిలా ఉండగా కృష్ణవంశీ , మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన మురారి సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.. ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు బర్తడే సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు అంటూ వార్తలు రావడమే కాదు ఈ మేరకు.. ఈ సినిమాకు సంబంధించిన పాటలు, వీడియో క్లిప్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. అంతేకాదు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అతిధి, దూకుడు వంటి సినిమాలను కూడా రీ రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Ram Charan: Krishna Vamshi is such a work for cherry.. Fans are worried..!
Ram Charan: Krishna Vamshi is such a work for cherry.. Fans are worried..!

రామ్ చరణ్ కోసం కథ సిద్ధం చేసిన కృష్ణవంశీ..

అయితే ఎట్టకేలకు మురారి సినిమాను రీ రిలీజ్ చేయాలని ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే మురారి దర్శకుడు కృష్ణవంశీ మీడియా ముందుకు రాగా.. మహేష్ బాబు ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వచ్చారు.. అందులో భాగంగానే ఒక నెటిజన్ మీరు రామ్ చరణ్ కి బాకీ ఉన్నారు.. మంచి గుర్తిండిపోయే సినిమా ఇవ్వాలని అన్నారు.. గుర్తుందా..? అని ఒక నెటిజన్ గుర్తు చేయగా.. దానికి కృష్ణవంశీ కూడా చక్కటి సమాధానాన్ని అందించారు.. ఆల్రెడీ నేను సిద్ధంగానే ఉన్నాను.. సూపర్ ఐడియా ఉంది.. స్క్రిప్ట్ కూడా రెడీ చేసి పెట్టాను.. రామ్ చరణ్ నాకు టైం ఇవ్వడమే ఆలస్యం అన్నట్టు రియాక్ట్ అయ్యారు కృష్ణవంశీ.. మొత్తానికి అయితే రామ్ చరణ్ ఒప్పుకుంటే కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక కొత్త మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దండం పెడుతున్న అభిమానులు..

ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు.. వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్లను ప్రకటిస్తూ దూసుకుపోతున్నారు.. మరి ఇలాంటి టైం లో కృష్ణవంశీకి ఆయన సమయం ఇస్తారా? లేదా ? అన్నది కాసేపు పక్కన పెడితే ..ఈ విషయం తెలిసి కొంతమంది అభిమానులు వద్దు సార్ అంటూ దండం పెడుతున్నారు. మరికొంతమంది ఏం పర్లేదు మరొకసారి కృష్ణవంశీకి ఛాన్స్ ఇవ్వచ్చు అంటూ కామెంట్లు చేస్తున్నారు.. మొత్తానికి అయితే కృష్ణవంశీ తో రామ్ చరణ్ కొత్త మూవీ అనేసరికి ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు.

- Advertisement -

అందుకే భయపడుతున్నారు..

ఇకపోతే రామ్ చరణ్ , కృష్ణ వంశీ కాంబినేషన్లో వచ్చిన గోవిందుడు అందరివాడేలే సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు.. కానీ మ్యూజికల్ పరంగా హిట్ అయింది.. ఇప్పటికీ ఈ సినిమా పాటలు ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఇక రాంచరణ్ కు విజయాన్ని అయితే ఇవ్వలేదు.. కానీ కొత్త మేకోవర్ లో చూపించేందుకు కృష్ణవంశీ ప్రయత్నం చేశాడు కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. అందుకే వీరిద్దరి కాంబోలో సినిమా అంటే అభిమానులు భయపడుతున్నారు. మరి ఏం మేరకు సినిమా పెట్టాలెక్కుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు