Akhil: ‘ఏజెంట్’ లో రామ్ చరణ్ – సురేందర్ రెడ్డి ప్లానింగ్ అదుర్స్..!

అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్పై థ్రిల్లర్ జానర్లో రూపొందిన ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28న విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. రిలీజ్ డేట్ రెండు వారాల దూరంలో ఉంది అనగా ప్రమోషన్స్ మొదలు పెట్టిన సినిమా యూనిట్ గ్యాప్ లేకుండా హై స్పీడ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ ముందు వరకు పెద్దగా బజ్ లేని ఈ సినిమాకు ట్రైలర్ రిలీజ్ తర్వాత భారీ హైప్ క్రియేట్ అయ్యింది. తాజాగా ఆడియెన్స్ ని సర్ప్రైజ్ చేస్తూ ఒక వీడియో వదిలింది సినిమా యూనిట్, ఆ వీడియోలో రాంచరణ్ కనిపించి అందరిని షాక్ కి గురి చేశాడు.

అఖిల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. రామ్ చరణ్ ధృవ క్యారెక్టర్లో కనిపించటంతో సురేందర్ రెడ్డి ధృవ సినిమా కి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. తమిళ్ సినిమా ‘తని ఒరువన్’ కి రీమేక్ గా వచ్చిన ధృవ సినిమా రామ్ చరణ్ కెరీర్లో డీసెంట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ధృవ సినిమా ద్వారా సురేందర్ రెడ్డి టేకింగ్ కి ఉన్న పవర్ మరోసారి ప్రూవ్ అయ్యింది.

ఏజెంట్ సినిమా కూడా స్పై థ్రిల్లర్ అవ్వటంతో ‘వైఆర్ఎఫ్’ తరహాలో సురేందర్ రెడ్డి కూడా ‘స్పై యూనివర్స్’ ఏమైనా క్రియేట్ చేస్తున్నాడా అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అఖిల్ కెరీర్లోనే తొలిసారిగా 80కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాపై అంచనాలు పెంచుతోంది తాజాగా విడుదలైన రామ్ చరణ్ వీడియో. ఇటు అఖిల్ కి, అటు సురేందర్ రెడ్డికి హిట్ కీలకమైన దశలో వస్తున్న ఏజెంట్ సినిమా నెలకొన్న భారీ అంచనాలను ఏ మేరకు అందుకుంటుందో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు