Ram: మిస్టర్ బచ్చన్ చూసి రామ్ వదిలేసాడా.? డబుల్ ఇస్మార్ట్ చూసి హరీష్ వదిలేసాడా.?

Ram: రీసెంట్గా బాక్స్ ఆఫీస్ వద్ద ఆగస్టు 15 సందర్భంగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ శంకర్. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ రెండు సినిమాలు అంతంత మాత్రమే ఆడాయి. మినిమం బ్రేక్ ఈవెన్ కూడా సాధించలేకపోయాయి ఈ సినిమాలు. ముఖ్యంగా మిస్టర్ బచ్చన్ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉండేవి. ఆ సినిమాకి సంబంధించిన పాటలు కూడా సినిమా మీద మంచి హైప్ క్రియేట్ చేశాయి. హరీష్ శంకర్ కూడా ఇదివరకు ఎప్పుడు ఇవ్వనని ఇంటర్వ్యూలు ఈ సినిమా గురించి ఇచ్చాడు.

ఇకపోతే హరీష్ శంకర్ పూరి జగన్నాథ్ ను ఒక గురువుల భావిస్తాడు అనే సంగతి తెలిసింది. అదే డేట్ నా డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా వస్తుంది కాబట్టి చాలామంది మిస్టర్ బచ్చన్ సినిమా వెనక్కి తగ్గుద్ది అని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన అది కుదరలేదు. అయితే హరీష్ శంకర్ కి పూరి జగన్నాథ్ కి మధ్య కొద్దిపాటి భేదాభిప్రాయాలు వచ్చినట్లు అప్పట్లో వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్ సినిమా ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చిందో క్లారిటీ కూడా ఇచ్చాడు హరీష్ శంకర్.

Double iSmart

- Advertisement -

హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ సినిమా గురించి చెబుతూ తను తర్వాత హీరో రామ్ సినిమాను చేయబోతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. అయితే ప్రస్తుతం ఆ సినిమా ఇప్పుడు జరగట్లేదు అని కథనాలు వినిపిస్తున్నాయి. కానీ దీని గురించి అధికార ప్రకటన ఇప్పటివరకు రాలేదు. అయితే ఈ వినిపిస్తున్న ఈ కథనాలని కొంతమంది ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అవడంతో డబుల్ ఇస్మార్ట్ సినిమా చూసి హరీష్ ప్రాజెక్ట్ వద్దనుకున్నాడా.? లేదంటే మిస్టర్ బచ్చన్ సినిమాను చూసి రామ్ సినిమాను వద్దనుకుంటున్నాడు అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు