Baby: ప్రీమియర్స్ కి సీక్రెట్ గా వచ్చిన రష్మిక – కారణమేంటి…?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా సాయి రాజేష్ డైరెక్షన్లో నటించిన బేబీ సినిమా ఇవాళ విడుదలైన సంగతి తెలిసిందే. రిలీజ్ కి ముందు నుండే పాజిటివ్ బజ్ సొంతం చేసుకున్న ఈ సినిమా ముందు రోజు వేసిన పెయిడ్ ప్రీమియర్స్ తో బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. అయితే, రిలీజ్ రోజు ఫస్ట్ షోకి కొంత డివైడ్ టాక్ వచ్చింది. ఈ సంగతి పక్కన పెడితే, ఈ సినిమా ప్రీమియర్స్ కి రౌడీ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రాశి ఖన్నా హాజరయ్యారు. వీరితో పాటుగా నేషనల్ క్రష్ రష్మిక కూడా హాజరవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాను ముందు నుండి దగ్గరుండి ప్రమోట్ చేస్తున్న రష్మిక ప్రీమియర్స్ కి హాజరవటంలో తప్పేముందని అనుకుంటున్నారా?, రష్మిక ప్రీమియర్స్ కి అటెండ్ అయిన విషయం వైరల్ అవ్వటానికి కారణం వేరే ఉంది.

అసలు విషయానికి వస్తే, రష్మిక ఈ ప్రీమియర్స్ కి సీక్రెట్ హాజరవటమే సోషల్ మీడియాలో వైరల్ అవ్వటానికి కారణం. బేబీ సినిమా ప్రీమియర్స్ కి రష్మిక ముఖానికి మాస్క్ పెట్టుకొని, తలకి క్యాప్ పెట్టుకొని టీషర్ట్, జీన్స్ లో టామ్ బాయ్ లాగా తనని ఎవరూ గుర్తు పట్టడానికి వీలు లేకుండా హాజరైంది. సినిమాను మొదటి నుండి ప్రమోట్ చేసిన రష్మిక ఇప్పుడు ప్రీమియర్స్ కి అంత సీక్రెట్ గా హాజరవ్వాల్సిన అవసరం ఏముందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

మరి కొంతమంది రష్మిక సీక్రెట్ గా రావటం వెనుక విజయ్ తో రిలేషన్ గురించి గాసిప్స్ అని అంటున్నారు. చాలా కాలం నుండి వీరిద్దరికి మధ్య స్ట్రాంగ్ రిలేషన్ ఉందని గాసిప్స్ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇద్దరు కలిసి హాజరయ్యారని తెలిస్తే మీడియా నుండి ప్రశ్నల వెల్లువ వచ్చి పడే అవకాశం ఉంది కాబట్టి, దాని నుండి తప్పించుకోవాలని ఈ స్టంట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి, రష్మిక ఇలా సీక్రెట్ గా హాజరవడం వెనుక కారణం ఏదైనా ఉందా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు