Rashmika Mandanna : సొంత ఇండస్ట్రీ నుంచి బ్యాన్ ?

నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే ఈ సుందరి స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. తెలుగులో లక్కీ గర్ల్ గా మారి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకున్న రష్మిక మందన్న ఇప్పుడు బాలీవుడ్ సినిమాలతో బాగా పాపులర్ అయింది.

అయితే ఈ బ్యూటీ ఇటీవల కావాలని కామెంట్ చేసిందో, లేక తొందరపాటులో మాట్లాడిందో తెలియదు కానీ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారాన్ని లేపుతున్నాయి. తనకి కన్నడలో ఫస్ట్ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలు పేరు పెట్టి పిలిస్తే అవమానం అన్న రేంజ్ లో.. ఓ ఈవెంట్ లో తనకి ఫస్ట్ ఆఫర్ ఇచ్చింది సో కాల్డ్ ప్రొడక్షన్ హౌస్ అంటూ మాట్లాడి వివాదానికి తెరలేపింది. అలాగే ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇప్పటివరకు “కాంతార” సినిమా చూడలేదని, తను బిజీగా ఉండడం వల్ల పెద్దగా సమయం దొరకడం లేదు అంటూ చెప్పుకొచ్చింది.

దీంతో ఆమెపై నెటిజన్స్ ట్రోలింగ్ మొదలుపెట్టారు. కర్ణాటక కు చెందిన రష్మిక సొంత రాష్ట్రంలోని సినిమాలను కించపరిచేలా మాట్లాడిందని కన్నడ సినీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. అయితే ఈ విషయం గురించి రష్మిక పై కన్నడ ఇండస్ట్రీలోని నిర్మాతల మండలి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆమెపై బ్యాన్ విధించాలని కన్నడ ఇండస్ట్రీ నిర్మాతల సంఘం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై రష్మిక ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు