Rashmika mandanna New Movies: నో ఛాన్స్ నుంచి కాల్షీట్స్ ఫుల్ వరకు

Rashmika Mandanna New Movies

నేషనల్ క్రష్ రష్మిక మందన్న… కన్నడ ఇండస్ట్రీలో కిర్రాక్ పార్టీ చిత్రం చేసి ఫేమ్ తెచ్చుకున్న రష్మిక చాలా ఫాస్ట్ గా స్టార్ హీరోయిన్ అయిపోయింది. అంతే కాదు, నేషనల్ క్రష్ అనే ట్యాగ్ ను కూడా సంపాదించుకుంది. సౌత్ లో స్టార్ స్టేటస్ తెచ్చుకున్న తర్వాత బాలీవుడ్ లో అడుగు పెట్టిన ఈ బ్యూటీ ఒక్క సారిగా అవకాశాలను కోల్పోయింది. బాలీవుడ్‌లో చేసిన సినిమాలు కూడా సక్సెస్ కాలేదు. దీంతో కెరీర్ ముగింపు దశ వరకు చేరుకుంది. పుష్ప, వారసుడు మినహా ఈ మధ్య కాలంలో రష్మిక చేసిన సినిమాలేవీ కూడా పెద్దగా హిట్ కాలేదు.

దీంతో రష్మికపై ఐరెన్ లెగ్ పడే అవకాశం ఉందని కూడా సినీ క్రిటిక్స్ అభిప్రాయపడ్డారు. కానీ, సడన్ గా రష్మికకు ఇండస్ట్రీలో ప్రాధాన్యత పెరిగిపోయింది. వరుసగా అవకాశాలు వస్తున్నాయి. హీరోయిన్స్ ఎక్కువగా లేకపోవడం, ఉన్న కొంత మంది ఇప్పటికే బిజీ అవ్వడంతో అవకాశాలు రష్మిక తలుపులు తడుతున్నాయి. ప్రస్తుతం నేషనల్ క్రష్ చేతిలో ఏకంగా ఆరు సినిమాలు ఉన్నాయని సమాచారం.

పుష్ప సీక్వెల్‌తో పాటు యానిమల్ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు రవితేజ, గోపిచంద్ మలినేని కాంబోలో వస్తున్న మూవీలో కూడా హీరోయిన్ గా రష్మికనే ఎంపిక చేశారట. అలాగే శేఖర్ కమ్ముల, ధనుష్ కలిసి చేస్తున్న D51లో రష్మిక హీరోయిన్‌గా ఇప్పటికే ఖరారు అయిందని టాక్. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. వీటితో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా సై అంటుంది రష్మిక.

- Advertisement -

ఇప్పటికే రెయిన్ బో అనే లేడీ ఓరియెంటెడ్ మూవీని నేషనల్ క్రష్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో సమంత చేయాల్సిన ఓ లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ చివరికి రష్మిక వద్దకే వచ్చి చేరిందని టాక్ ఈ మధ్య వినిపిస్తోంది. అలాగే విజయ్ దేవరకొండతో రష్మిక ముచ్చటగా మూడో సారి జత కట్టబోతుదట. విజయ్, గౌతమ్ తిన్ననూరి కాంబోలో వచ్చే మూవీలో హీరోయిన్ గా రష్మిక నే ఫైనల్ చేశారట. ఈ ప్రాజెక్ట్ లో ముందుగా శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారు. కానీ, ఇప్పుడు శ్రీలీల డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో చిత్ర యూనిట్ రష్మికను ఎంపిక చేశారని టాక్. దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.

ఇలా ఒక్క ఛాన్స్ లేకుండా ఉన్న నేషనల్ క్రష్ ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీ గా ఉంది. అంతే కాదు… ఇప్పటికే ఆరు సినిమాల ఛాన్స్ లు రావడంతో కొత్త సినిమాలకు రష్మిక సైన్ చేయడం లేదట. ఈ మధ్య మరో రెండు సినిమాల్లో అవకాశం వస్తే, డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో రిజెక్ట్ కూడా చేసిందట. దీంతో రష్మిక కమ్ బ్యాక్ పవర్ ఫుల్ గా ఉంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు