Vijay Devarakonda – Rashmika Mandanna : విజయ్ సినిమాలో రష్మిక.. ఫ్యాన్సూ ఈసారి హర్ట్ అయ్యే ఛాన్స్ లేదమ్మా..

Vijay Devarakonda – Rashmika Mandanna : రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పన్నక్కర్లేదు.. ఈయన సినిమాలు ఈ మధ్య బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన క్రేజ్ తగ్గలేదు.. ఫ్యాన్స్ ఆయన నెక్స్ట్ సినిమా ఏంటా అని వెయిట్ చేస్తున్నారు.. అలాగే డైరెక్టర్స్ విజయ్ తో సినిమాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. విజయ్ దేవరకొండను లవర్ బాయ్ గా చూడాలని లేడి ఫ్యాన్స్ భావిస్తున్నారు.. అందులోనూ గీతా గోవిందం కాంబో రిపీట్ అయితే బాగుండునని అనుకుంటున్నారు. ఇటీవల రష్మిక విజయ్ సినిమాల్లో నటిస్తుందనే టాక్ వినిపించిన సంగతి తెలిసిందే.. గతంలో వచ్చిన రెండు సినిమాలల్లో రష్మిక నటిస్తుందని వార్తలు వినిపించాయి. కానీ ఎక్కడా ఆమె కనిపించలేదు..

దాంతో ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు.. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే చూడాలని ఆశ పడుతున్నారని తెలుస్తుంది.. ఆ కోరిక త్వరలోనే నేర వేరేబోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.. రష్మిక- విజయ్ దేవరకొండ కలిసి ఓ సినిమా చేయబోతున్నారనే వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి.. విజయ్ చెయ్యబోతున్న కొత్త సినిమాల్లో రష్మిక నటించే అవకాశాలు ఉన్నట్లు టాక్.. ఈసారి ఫ్యాన్స్ హర్ట్ అయ్యే ఛాన్స్ లేదని తెలుస్తుంది. మరి వీరిద్దరూ కలిసి ఏ సినిమాలో నటిస్తారు.. ఆ సినిమాకు డైరెక్టర్ ఎవరు అనేది హాట్ టాపిక్ గా మారింది.. త్వరలోనే దానిపై అప్డేట్ వస్తుందేమో చూడాలి…

Rashmika Mandanna is going to write a Vijay Devarakonda film.. Who is the director?
Rashmika Mandanna is going to write a Vijay Devarakonda film.. Who is the director?

ప్రస్తుతం వీరిద్దరూ బిజీగా ఉన్నారు.. రష్మిక మందన్న బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టింది. అక్కడ వరుస సక్సెస్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ బిజీగా గడుపుతుంది. తెలుగులో పుష్ప 2 సినిమాలో నటిస్తుంది. ఆ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది.. ఇక మొత్తం అర డజను సినిమాలు రష్మిక చేతిలో ఉన్నాయన్న సంగతి తెలిసిందే… ఇక విజయ్ దేవరకొండ రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. అది మిక్సీ్డ్ టాక్ ను అందుకుంది. అయితే ఇప్పుడు మూడు క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నాడు.. ఆ సినిమాలన్నా విజయ్ కు హిట్ టాక్ ను అందిస్తాయేమో చూడాలి…

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు