Rashmika Mandanna : ఆ బిజినెస్ మ్యాన్ తో రష్మిక పెళ్లి.. అయ్యో అతన్ని వదిలేసిందా?

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగుతో పాటుగా పాన్ ఇండియా హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది. అయితే సినిమాల పరంగా సక్సెస్ అయిన అమ్మడు పెళ్ళెప్పుడు చేసుకుంటుందో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. గతంలో విజయ్ దేవరకొండతో ప్రేమ వ్యవహారం నడిపిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు వీరిద్దరూ కలిసి వెళ్లిన ట్రిప్స్ ల ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతుందనే టాక్ మొన్నటివరకు నడిచింది. ఇప్పుడు మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది..

అదేంటంటే .. రష్మిక విజయ్ దేవరకొండకు హ్యాండ్ ఇచ్చేసిందని త్వరలోనే బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకోబోతుందని టాక్.. అందుకు కారణం కూడా లేకపోలేదు.. ఈ బ్యూటీ రీసెంట్ గా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల పెళ్ళికి ఎల్లో కలర్ లెహంగాలో వెళ్ళింది. అయితే రష్మిక మందన్నా వేసుకున్న పసుపు లంగాహోణి ధర అందరికీ మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది.. సరికొత్తగా డిజైన్ చేయబడిన ఆ లెహంగా ధర దాదాపుగా రెండు లక్షల వరకు ఉంటుందని సమాచారం..లెహంగాకి తగ్గట్లు హెయిర్ స్టైల్ తో పాటు జువెల్లరీ కూడా ధరించి పెళ్లిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆ డ్రెస్సులో చాలా అందంగా కనిపించింది.. అందరి చూపు తనవైపే ఉంది.. ఆ ఫోటోలు కూడా వైరల్ అవ్వడంతో నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు..

Rashmika's marriage with that businessman..
Rashmika’s marriage with that businessman..

అంబానీ ఫ్యామిలీకి తగ్గట్లే రష్మిక లుక్ ఉండటంతో బిజినెస్ మ్యాన్ తో పెళ్లి ఫిక్స్ అయిందనే వార్తలు ఊపందుకున్నాయి. అంబానీకి దగ్గర చుట్టంతో పెళ్లి అందుకే వాళ్ళ స్టేటస్ కు తగ్గట్లే రెడీ అయ్యింది కాబోలు అంటూ టాక్. గతంలో విజయ్ తో ప్రేమాయణం అనే వార్తలు వినిపించాయి. మరి ఇప్పుడు వినిపిస్తున్న వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే రష్మిక రెస్పాండ్ అయ్యేవరకు వెయిట్ చెయ్యాల్సిందే.. ఇక సినిమాల విషయానికొస్తే.. పుష్ప 2 తో పాటుగా బాలీవుడ్ లో పలు సినిమాలు చేస్తుంది.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు