Eagle : హిందీలో డిఫరెంట్ టైటిల్ తో రాబోతున్న రవితేజ… ఎందుకంటే?

మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం “ఈగల్” పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. అయితే మిగతా అన్ని భాషల్లోనూ “ఈగల్” టైటిల్ తోనే ఈ మూవీ న రిలీజ్ చేస్తున్నారు. ఒక్క హిందీలో మాత్రం టైటిల్ ను చేంజ్ చేస్తున్నారు మేకర్స్. మరి బాలీవుడ్ లో ఈ మూవీని వేరే టైటిల్ తో ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? అసలు టైటిల్ మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? అనే వివరాల్లోకి వెళితే…

రవితేజ హీరోగా నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ “ఈగల్”. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్ రొమాన్స్ చేయబోతోంది. ఇక గత కొద్ది రోజులుగా ఈ మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేద్దామా వద్దా అని డైలాగ్ లో ఉన్న మేకర్స్ తాజాగా ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఈ మూవీ సంక్రాంతి రేసులో ఉండబోదని, పోస్ట్ పోన్ అవుతుందంటూ వస్తున్న రూమర్స్ కు చెక్ పెడుతూ జనవరి 13న “ఈగల్” రాబోతోంది అంటూ హిందీ టీజర్ తో స్పష్టం చేశారు. అయితే “ఈగల్” హిందీ టీజర్ ను చూసిన ప్రేక్షకులకు అనుకోని షాక్ తగిలింది. ఎందుకంటే హిందీలో మేకర్స్ ఈ మూవీని వేరే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. నిజానికి “ఈగల్” టైటిల్ బాగుంది. మరి అలాంటప్పుడు హిందీ వర్షన్ కు ఎందుకు టైటిల్ మార్చారు? అసలు హిందీ వర్షన్ కు పెట్టిన టైటిల్ ఏంటి? అంటే..

“ఈగల్” మూవీని హిందీలో “సహదేవ్” అనే పేరుతో రిలీజ్ చేయబోతున్నట్టు టీజర్ ద్వారా ప్రకటించింది చిత్ర బృందం. ఎందుకంటే హిందీలో ఆల్రెడీ “ఈగల్” టైటిల్ తో ఓ మూవీ ఉందని, అందుకే హిందీ వర్షన్ కు టైటిల్ మార్చక తప్పలేదని సమాచారం. ఏదైతేనేం ఈ మూవీ తప్పకుండా హిట్ అవుతుందని దర్శక నిర్మాతలతో పాటు హీరో కూడా ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. గతంలో రవితేజ పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చిన “టైగర్ నాగేశ్వరరావు” మూవీ మాస్ మహారాజాను తీవ్రంగా నిరాశపరిచింది. నిజానికి ఆ మూవీపైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు రవితేజ. హిందీలో రవితేజకు సైతం మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మన ఎనర్జిటిక్ హీరో నటించిన చాలా సినిమాలో హిందీలో డబ్ అయ్యి యూట్యూబ్లో రిలీజ్ అవుతుంటాయి. వాటికి అక్కడి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో పాన్ ఇండియా హీరోగా రవితేజను కూడా ఆదరిస్తారని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టైగర్ నాగేశ్వరరావు డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఆ మూవీ ప్లాప్ తో చతికిలపడిపోకుండా మరోసారి “ఈగల్” మూవీతో పాన్ ఇండియా బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి రెడీ అవుతున్నాడు రవితేజ. మరి ఈసారైనా రవితేజ ఆశించిన విజయాన్ని అందుకుంటాడా? అనేది చూడాలి.

- Advertisement -

హిందీ విషయంలో అలా ఉన్నప్పటికీ తెలుగులో మాత్రం ఈ సీనియర్ హీరోకు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఎదురవబోతోంది. టాలీవుడ్ లో ఉన్న చాలామంది స్టార్ హీరోలు సంక్రాంతి పై కన్నేశారు. మహేష్ బాబు “గుంటూరు కారం” సినిమాతో, నాగార్జున “నా సామి రంగ”, వెంకటేష్ “సైంధవ్”, ఇక మరో క్రేజీ మూవీ “హనుమాన్” లతో పాటు రవితేజ “ఈగల్” కూడా సంక్రాంతి బరిలోకి దిగబోతోంది. మరి వీటన్నిటిని తట్టుకొని “ఈగల్” నిలబడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు