Ravi Teja vs Puri Jaggandh: ఆ ఫ్రెండ్ షిప్ ఏమయిపోయింది మాస్ మహారాజా

Ravi Teja vs Puri Jaggannadh: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోస్ లో రవితేజ ఒకరు. మామూలుగా చాలామంది హీరోలకి యాంటీ ఫ్యాన్స్ ఉంటారు. కానీ రవితేజ విషయానికి వస్తే చాలామంది హీరోల ఫ్యాన్స్ కూడా రవితేజను ఇష్టపడుతుంటారు. రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలుపెట్టి, తర్వాత నటుడుగా మారి, ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం స్టార్ హీరోగా ఎదుగుతున్నాడు. ఇక ప్రస్తుతం రవితేజ సినిమా అంటే మంచి ఓపెనింగ్స్ వస్తాయి. అలానే రవితేజ కూడా మంచి మార్కెట్ ఉంది.

ఇకపోతే రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న టైంలోనే, పూరి జగన్నాథ్ మంచి పరిచయం ఉంది. ఆ టైంలో రవితేజను ఉద్దేశిస్తూ నిన్ను మంచి హీరోని చేస్తాను అంటూ పూరి జగన్నాథ్ తరుచూ చెప్పేవాడు. అయితే ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు రవితేజ. కానీ పూరి జగన్నాథ్ మాత్రం రవితేజ లో ఉన్న నటుడుని గుర్తించి అద్భుతమైన బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చాడు. రవితేజ కి స్టార్డం రావడానికి కారణం పూరి జగన్నాథ్ ఇచ్చిన సినిమాలు చెప్పొచ్చు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న తమిళమ్మాయి వంటి సినిమాలు రవితేజను స్టార్ హీరోని చేశాయి. అలానే పూరి జగన్నాథ్ ను కూడా స్టార్ డైరెక్టర్ ను చేసేసాయి. పూరి జగన్నాథ్ స్టార్ డైరెక్టర్ అయిపోయిన తర్వాత అటువంటి చిన్న కాన్సెప్ట్ సినిమాలు చేయటం మానేసాడు.

Ravi Teja - Puri Jagannadh

- Advertisement -

ఇక ప్రస్తుతం పూరి పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఇప్పటివరకు సరైన హిట్ తన కెరియర్లో లేకుండా పోయింది. ఎన్నో అంచనాలతో వచ్చిన లైగర్ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. లైగర్ దెబ్బతో ఒక షెడ్యూల్ పూర్తి చేసిన జనగణమన సినిమా కూడా క్లోజ్ చేసేసారు. ఇకపోతే ప్రస్తుతం పూరి జగన్నాథ్ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. రామ్ తో డబుల్ ఇస్మార్ట్ శంకర్ ని తెరకెక్కిస్తున్నాడు పూరి. ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

అయితే అదే డేట్ నా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. అయితే రిలీజ్ డేట్ విషయంలో వీరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లు తెలుస్తోంది. మిస్టర్ బచ్చన్ సినిమా రిలీజ్ డేట్ మార్చమన్నా కూడా రవితేజ మార్చట్లేదు అంటూ విశ్వసినీ వర్గాల సమాచారం. ఈ విషయంలో పూరి అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. అయితే వీరి మధ్య ఫ్రెండ్షిప్ ఏమైంది అంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు