Ravi Teja : ఈ ప్రేక్షక దేవుళ్లు మీ సినిమాలు చూడటానికేనా… మీ సాయం తీసుకోవడానికి అర్హులు కాదా…?

Ravi Teja : టాలీవుడ్ హీరో మాస్ మహారాజ రవి తేజా (Ravi Teja) గురించి అందరికీ తెలిసిందే.. ధమాకా తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈయన ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేశాడు. కానీ ఒక్క సినిమా కూడా మంచి టాక్ ను అందుకోలేదు. ఇక కాస్త గ్యాప్ తీసుకొని రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా అనుకున్న హిట్ టాక్ ను అందుకోలేదు. కలెక్షన్స్ కూడా అంతంత మాత్రాన అందుకుంది. దాంతో సినిమాకు తీసుకున్న రెమ్యూనరేషన్ ను కూడా హీరో, డైరెక్టర్ వెనక్కి ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా రిలీజ్ సమయంలో తెలుగు ప్రజల గురించి ఎన్నెన్నో చెప్పిన రవితేజ మాత్రం తెలుగు రాష్ట్రాల వరద భాధితులను ఆదుకోవడానికి ముందుకు రాలేదు. ఒక్క రూపాయి కూడా సాయం ప్రకటించలేదు.. దీనిపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

మిస్టర్ బచ్చన్ ఎఫెక్ట్..

రవి తేజా (Ravi Teja ), భాగ్య శ్రీ  ( Bhagya sri borse)జంటగా వచ్చిన సినిమా మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan).. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమా భారీ అంచనాలతో ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందు వచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందు ఎలాంటి టాక్ ను అందుకుందో ఇప్పుడు ఆ టాక్ కనిపించలేదు. మొత్తానని సినిమా యావరేజ్ టాక్ ను అందుకుంది. అయితే ఈ సినిమా కలెక్షన్స్ సరిగ్గా రాలేదు. దాంతో సినిమాకు తీసుకున్న రెమ్యూనరేషన్ ను కొంతవరకు వెనక్కి ఇచ్చేశాడు రవితేజా.. ఈ విషయం తెలిసి రవితేజా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ మూవీ పెద్దగా హిట్ అవ్వలేదు కానీ మరో రెండు సినిమాలను రవితేజ లైన్లో పెట్టాడు. ఆ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.

Ravi Teja who did not declare donation to Telugu states .. fans fire
Ravi Teja who did not declare donation to Telugu states .. fans fire

ఈ ప్రేక్షక దేవుళ్లు మీ సినిమాలు చూడటానికేనా రవితేజ..

ప్రస్తుతం ఏపీ, తెలంగాణాలో భారీ వర్షాల కారణంగా వరదలు భీభత్సం సృష్టించాయి. ఈ వరదల కారణంగా ఎంతో మంది ప్రజలు రోడ్డున పడ్డారు. ఆకలి దప్పుల కేకలు పెడుతున్నారు. ప్రజలను ఆదుకోవడానికి సినీ హీరోలు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్, విశ్వక్ సేన్, చిరంజీవి, సిద్దు జొన్నలగడ్డ, అశ్విని దత్ తదితరులు భారీ విరాళాలను ప్రకటిస్తున్నారు. అయితే రవి తేజా మాత్రం దీనిపై స్పందించలేదు. ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విరాళం ఇవ్వలేదు. మిస్టర్ బచ్చన్ ఈవెంట్ లో ఈ ప్రేక్షక దేవుళ్ల వల్లే సినిమాలు ఇలా ఉన్నాయని చెప్పాడు. ఆ వీడియోను ఇప్పుడు జనాలు ట్యాగ్ చేస్తూ రవితేజకు చురకలు అంటిస్తున్నారు..ఈ ప్రేక్షక దేవుళ్లు మీ సినిమాలు చూడటానికేనా రవితేజ గారు అంటూ కామెంట్స్ చేస్తున్నాయి. దీనిపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి..

 

View this post on Instagram

 

A post shared by RAVI TEJA (@raviteja_2628)

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు