Raviteja Next Movie : రవితేజ మూవీకి వెరైటీ టైటిల్… వర్కౌట్ అవుతుందా రాజా?

Raviteja Next Movie : మాస్ మహారాజా రవితేజ అద్భుతమైన కామెడీ టైమింగ్ తో, అలాగే కమర్షియల్ అంశాలు ఉండే సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తాడు. కానీ ఇటీవల కాలంలో ఈ హీరో టైం అంతగా బాలేదు. చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాస్త జోరు తగ్గించి ఆచితూచి అడుగులు వేస్తున్నారు రవితేజ. అయితే తాజాగా రవితేజ చేయబోతున్న నెక్స్ట్ మూవీ టైటిల్ ఇదే అంటూ సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతుంది. దీంతో ఆ వెరైటీ టైటిల్ ని చూశాక అసలు ఇది వర్క్ అవుట్ అవుతుందా? అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

వర్కవుట్ అవుతుందా రాజా?

ప్రస్తుతం రవితేజ హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా మరో మూవీని కూడా లైన్లో పెట్టిన ఈ హీరో నెక్స్ట్ సినిమాపై క్లారిటీ వచ్చింది. మాస్ డైరెక్టర్ బాబి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రవితేజ నెక్స్ట్ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బాబి బాలయ్యతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ మూవీ పూర్తయ్యాక రవితేజ బాబీ కాంబినేషన్ లోని ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళబోతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మూవీ టైటిల్ ఇదేనంటూ తాజాగా ఓ వార్త తెరపైకి వచ్చింది. ప్రస్తుతం తమ చేతుల్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి వచ్చే ఏడాది వీరిద్దరూ కలిసి పని చేయబోతున్నారని అంటున్నారు.

Raviteja Introducing Samajavaragamana Writer As Director?

- Advertisement -

సమాచారం ప్రకారం ఇదొక పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ రవితేజ, బాబి సినిమాకు ప్రజల మనిషి అని టైటిల్ ను ఫిక్స్ చేశారని ఫిలింనగర్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఇదేమంత పవర్ ఫుల్ టైటిల్ లా అనిపించట్లేదు అని అంటున్నారు. టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, రావణాసుర వంటి టైటిల్సే పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ ప్రజల మనిషి అనేది ఎంతవరకు జనాలను ఎట్రాక్ట్ చేస్తుంది అనేది ఇప్పుడు కొత్త డౌట్. మరి సినిమా అనౌన్స్మెంట్ తో పాటు టైటిల్ ని కూడా చిత్ర బృందం ప్రకటిస్తుందా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.

రవితేజ, బాబి కాంబినేషన్ లో రెండో మూవీ…

నిజానికి బాబితో రవితేజ సోలో హీరోగా చేస్తున్న ఫస్ట్ మూవీ ఇదే. అయితే వాల్తేరు వీలయ్య సినిమాలో చిరుతో పాటు రవితేజ కూడా కీలకపాత్రలో నటించిన విషయం తెలిసిందే. కాబట్టి రెండోసారి వీరిద్దరి కాంబో రిపీట్ కాబోతున్నట్టు లెక్క. అయితే ఈ సినిమాలో రవితేజ సరసన ఊర్వశి రౌతెల, డింపుల్ హయాతి లీడింగ్ లేడీస్ గా నటించబోతున్నారని టాక్ నడుస్తోంది. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ ప్రాజెక్ట్ ను మేకర్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం రవితేజ చేతిలో మిస్టర్ బచ్చన్ తో పాటు భాను భోగవరపు అనే డైరెక్టర్ తో తన 75వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. రెండు సినిమాలను కూడా ఈ ఏడాదిలోనే పూర్తి చేయబోతున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు