RaviTeja75 : పండక్కివస్తారట.. దానికన్నా ముందు రావాల్సిన వాటి పరిస్థితేంటి!

RaviTeja75 : టాలీవుడ్ లో మాస్ మహారాజ గా అభిమానుల చేత పిలిపించుకుంటున్న రవితేజ వరుస సినిమాలతో హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. గత మూడు చిత్రాలతో హ్యాట్రిక్ ప్లాప్స్ అందుకున్నా కూడా, ఏకంగా నాలుగు కొత్త సినిమాలని లైన్లో పెట్టాడు రవన్న. ఓ వైఫుడ్ యాక్షన్ కథలని చేస్తూనే, మరో వైపు తన బ్రాండ్ అయిన కమర్షియల్ కామెడీ ఎంటెర్టైనెర్స్ కూడా సెట్స్ పైకి తీసుకొని వెళ్తున్నాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ “మిస్టర్ బచ్చన్” మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఇక ఈ సినిమాను ఆగష్టు లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, లేటెస్ట్ గా ల్యాండ్ మార్క్ మూవీ అయిన రవితేజ 75వ చిత్రం త్వరలోనే స్టార్ట్ కాబోతోందని అనౌన్స్ చేసారు. సామజవరగమన ఫేమ్ భాను భోగవరపు దర్శకత్వంలో రవితేజ (RaviTeja75) ఈ చిత్రం చేయబోతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాయి.

RaviTeja75 movie is in the 2025 Sankranti race

సంక్రాంతికి తెస్తారట.. మరి ముందు సినిమాల సంగతేంటి!

ఇక తాజాగా అనౌన్స్ అయిన రవితేజ 75వ మూవీ ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే ఈ చిత్రాన్ని సంక్రాంతి కి రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. కానీ దీనికంటే ముందుగా రవితేజ మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. మరి వాటన్నిటిని ఆపి దీనిపై ఫోకస్ చేయడమేంటన్న వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్న రవితేజ ఆ సినిమా పూర్తి చేసే దశలో ఉన్నారు. కానీ ఇప్పటివరకు రిలీజ్ డేట్ ప్రకటించలేదు. ఇదీ గాక, గోపీచంద్ మలినేని తో రవితేజ సినిమా ఆగిపోయింది. మళ్ళీ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చెప్పలేం. ఇక దీంతో పాటు అనిల్ రావిపూడి సినిమా కూడా ఉంటుందని అన్నారు. అలాగే త్రినాథ రావు నక్కిన తో సినిమా ఉందని వార్తలు వచ్చాయి. కానీ ఇవన్నీ కాకుండా భాను భోగవరపు సినిమా స్టార్ట్ చేయడానికి కారణం ఏంటని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే సినిమాలో అంత కంటెంట్ ఉందా అని నెటిజన్లు అంటున్నారు. ఒక వేళా ఉన్నా, ఆరు నెలల కాలంలో షూటింగ్ ఫినిష్ చేసి పండక్కి తీసుకొస్తారా అనే అనుమానం వస్తుంది.

- Advertisement -

పోటీని తట్టుకోగలరా?

ఇకపోతే నాగవంశీ నిర్మిస్తున్న రవితేజ75 సినిమాలో హీరోయిన్ గా క్రేజీ హీరోయిన్ శ్రీలీలని ఖరారు చేసినట్లు టాక్. ఇప్పటికే శ్రీలీల రవితేజకి జోడీగా ధమాకా మూవీలో నటించింది. అయితే ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని సితార ఎంటర్టైన్మెంట్స్ భావిస్తోంది. ఇప్పటికే సంక్రాంతి రేసులో అరడజను సినిమాలు ఉన్నాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర, ప్రభాస్ రాజాసాబ్, వెంకటేష్ అనిల్ రావిపూడి మూవీ, నాగార్జున బంగార్రాజు 2, అలాగే అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ కూడా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇవి కాకుండా ఈ ఏడాది హరిహర వీరమల్లు రాకపోతే సంక్రాంతి బరిలో నిలిచే అవకాశాలున్నాయి. ఇంత టైట్ పోటీ మధ్యలో రవితేజ సినిమాని కూడా సంక్రాంతి రేసులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తూ ఉండటం ఆసక్తికరంగా మారింది. మరి ఇంత పోటీలో రవితేజ సినిమా తట్టుకుని నిలబడగలదా? అసలు రవితేజ 75ని అనుకున్న ప్లాన్ ప్రకారం సంక్రాంతికి రిలీజ్ చేయగలరా లేదా అన్నది వేచి చూడాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు