RC 16: రామ్ చరణ్ షూటింగ్ కి రావడం లేదా.? అందుకనే సినిమా షిఫ్ట్ అవుతోందా.?

RC 16: తెలుగులో విపరీతమైన క్రేజ్ సాధించుకున్న రామ్ చరణ్ తేజ్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సాధించుకున్నాడు. చిరు తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి, నేడు తండ్రిని మించిన తనయుడు అని అనిపించుకుని రేంజ్ కు ఎదిగాడు. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య సినిమా ఊహించిన స్థాయిలో ఆడియన్స్ను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం రామ్ చరణ్ ఫినిష్ చేసిన గేమ్ చేంజర్ సినిమా పైన సర్వత్ర ఆసక్తి నెలకొంది.

గేమ్ చేంజర్ సినిమా దాదాపు ఐదేళ్ల క్రితం మొదలైంది. కానీ దర్శకుడు శంకర్ ఒకేసారి రెండు ప్రాజెక్టులను డీల్ చేయడం వలన ఈ సినిమా డిలే అవుతూ వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకి సంబంధించి రామ్ చరణ్ షూటింగ్ దాదాపు అయిపోయింది. ఇక ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ తన 16వ సినిమా చేయాల్సి ఉంది. మామూలుగా ఈ సినిమా సెప్టెంబర్ లో స్టార్ట్ అవుతుంది అని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా అక్టోబర్ కు షిఫ్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిని బట్టి కొంతమంది నెగటివ్ ఫ్రెండ్స్ రామ్ చరణ్ షూటింగ్ కి రావడం లేదు. గేమ్ చేంజర్ సినిమా అయిపోయిన తర్వాత కూడా ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించట్లేదు అంటూ తమ వెర్షన్ మొదలుపెట్టారు.

100+] Ram Charan Wallpapers | Wallpapers.com

- Advertisement -

బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ చేయబోయే సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్ గ్రౌండ్ లో ఉండబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఇదివరకే గోదావరి బ్యాక్ డ్రాప్ లో చేసిన రంగస్థలం సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇప్పుడు సుకుమార్ శిష్యుడు అంతకు మించిన హిట్ ఇవ్వాలని తాపత్రయంతో ఉన్నాడు. ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది.

బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న రెండవ సినిమా ఇది. మొదటి సినిమాతోనే 100% సక్సెస్ తో ప్రూవ్ చేసుకుని, 100 కోట్ల మార్కెట్లో చేరిపోయాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నాడు అని వార్తలు కొంతకాలం పాటు వినిపించాయి. కానీ సడన్ గా రామ్ చరణ్ పేరు తెరమీదకి వచ్చి అధికారక ప్రకటన కూడా ఇస్తూ అతి త్వరలో పనులు మొదలుపెట్టనున్నారు. రెండవ సినిమాకి రామ్ చరణ్ ను డైరెక్ట్ చేసే అవకాశం రావడం అనేది మామూలు విషయం కాదు. దీనిలో దర్శకుడు సుకుమార్ పాత్ర కూడా ఉంది అని చెప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు