RC 16: రామ్ చరణ్ సినిమాలో తమిళ్ స్టార్ హీరో.?

RC 16: రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రిలీజ్ కావాల్సిన ఏ సినిమా ఇంకా రిలీజ్ కి నోచుకోలేదు. ఈ సినిమాతో పాటుగా శంకర్ భారతీయుడు అనే సినిమాను కూడా చేశాడు. ఆ సినిమా రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ ను మూట కట్టుకుంది. ఇకపోతే ప్రస్తుతం గేమ్ చేంజెర్ సినిమా డిసెంబర్లో రిలీజ్ కానున్నట్లు ఇదివరకే దిల్ రాజు ఇన్ డైరెక్ట్ గా ప్రకటన కూడా చేసేసారు. ఇక దీని గురించిన అధికారి ప్రకటన త్వరలో రావాల్సి ఉంది. ఈ సినిమాకి సంబంధించి రామ్ చరణ్ పోర్షన్ అంతా పూర్తయిపోయింది.

ఇక ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ సినిమాని చేయనున్నాడు. ఉప్పెన సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు బుచ్చిబాబు. అయితే మొదటి సినిమాతోనే దాదాపు 100 కోట్లు సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు రాంచరణ్ తో చేయబోయే సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో తమిళ్ హీరో సూర్య ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీని గురించి అధికార ప్రకటన ఇంకా రాలేదు. ఒకవేళ నిజంగానే సూర్య ఈ సినిమాలో కనిపిస్తే ఈ సినిమా గురించి హైప్ ఇంకా పెరిగిపోతుంది.ఇకపోతే మురగదాస్ దర్శకత్వంలో సూర్య చేసిన సెవెంత్ సెన్స్ అనే సినిమా తెలుగు రిలీజ్ టైం లో రామ్ చరణ్ గెస్ట్ గా హాజరై మంచి సపోర్ట్ అందించారు.

 Rc16

- Advertisement -

ఇక ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఇప్పటివరకు రామ్ చరణ్ సినిమా రాలేదు. ఆచార్య సినిమాలో రామ్ చరణ్ ఒక కీలకపాత్రలో కనిపించిన కూడా అది అభిమానుల్ని అంతగా ఆకట్టుకోలేదు. ఎక్కడో కొద్దిపాటి అసంతృప్తి మిగిలింది. ఇక రాంచరణ్ సినిమా వస్తే బాక్స్ ఆఫీస్ వద్ద బ్రహ్మ రథం పట్టడానికి రామ్ చరణ్ అభిమానులతో పాటు చాలామంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇక గేమ్ చేంజెర్ సినిమా పైన మంచి అంచనాలు కూడా ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఇదివరకే జరగండి అనే పాటను కూడా రిలీజ్ చేశారు. ఇకపోతే ఈ సినిమాలో ఇంకో ఏడు పాటలు ఉన్నట్లు తమను కూడా తెలిపాడు. ఇక ఈ సినిమాకి సంబంధించి సెకండ్ సింగిల్ కూడా త్వరలో రిలీజ్ చేయనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు