Game Changer : “గేమ్ ఛేంజర్” ఇంటర్వెల్ ట్విస్ట్ లీక్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం “గేమ్ ఛేంజర్” అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ట్రిపుల్ ఆర్ తర్వాత చెర్రీ చేస్తున్న మూవీ ఇదే కావడంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి. కానీ మరోవైపు ఈ సినిమాను తెరకెక్కిస్తున్న శంకర్ మెగా ఫ్యాన్స్ సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఎట్టకేలకు ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కు సంబంధించిన అప్డేట్ చెర్రీ బర్త్ డే గిఫ్ట్ గా రాబోతుందని ప్రచారం జోరు అందుకుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ మూవీ ఇంటర్వెల్ సీన్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతుంది. మరి తాజాగా లీకైన ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ ఏంటి? అంటే…

మెగా నిరీక్షణకు ఫుల్ స్టాప్ పడనుందా?
విజనరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా “గేమ్ ఛేంజర్”. ఈ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీకాంత్, అంజలి, సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. దిల్ రాజు ఈ భారీ బడ్జెట్ మూవీని నిర్మిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ మూవీని మొదలు పెట్టి మూడేళ్లు అవుతున్నప్పటికీ ఇంకా సినిమా పూర్తి కాలేదు. “గేమ్ ఛేంజర్” నుంచి ఇప్పటిదాకా కనీసం గ్లింప్స్ కూడా రిలీజ్ చేయలేదు మేకర్స్. ఫస్ట్ లుక్ మాత్రమే వదిలారు. అప్పటి నుంచి లీకుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇక శంకర్ మరోవైపు “ఇండియన్ 2” షూటింగ్ లో నిమగ్నం అవ్వడంతో, “గేమ్ ఛేంజర్” షూటింగ్ ఏడాదిన్నర ఆలస్యం అయ్యింది. మిగతా హీరోలు అందరి సినిమాల నుంచి అప్డేట్స్ వస్తుండడం, ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్న “గేమ్ ఛేంజర్” నుంచి మాత్రం ఒక్క అప్డేట్ కూడా బయటకు రాకపోవడంతో మెగా ఫాన్స్ లో సహనం సన్నగిల్లింది. ఒకానొక సమయంలో సోషల్ మీడియా వేదికగా శంకర్ పై బూతులతో విరుచుకుపడ్డారు. అయినప్పటికీ మేకర్స్ రెస్పాండ్ అవ్వకపోవడంతో, ఇప్పట్లో అప్డేట్ ను ఆశించడం కూడా వృధా అన్నట్టుగా సైలెంట్ అయిపోయారు. తాజాగా మరోసారి ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేస్తారనే టాపిక్ తెరపైకి వచ్చింది.

ఇంటర్వెల్ ట్విస్ట్ లీక్…
ఇప్పటికే “గేమ్ ఛేంజర్” నుంచి “జరగండి” అనే సాంగ్ లీకైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇంట్రడక్షన్ సీన్ కి సంబంధించిన ఫోటో అంటూ రాంచరణ్ హెలికాప్టర్ నుంచి దిగే పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా ఈ సినిమా ఇంటర్వెల్ లో ట్విస్ట్ కూడా లీక్ అయ్యింది. సినిమాలో ఇద్దరూ రామ్ చరణ్ లు ఉంటారని, అందులో ఒకరంటే ఒకరికి అస్సలు పడదని ప్రచారం జరుగుతోంది. అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఒక రామ్ చరణ్ మరొక రామ్ చరణ్ పై కాల్పులు జరుపుతాడని, అదే టైంలో ఇంటర్వెల్ కార్డు పడుతుందని అంటున్నారు. అయితే ముందుగా శత్రువులుగా ఉన్న వీళ్ళిద్దరూ చివరికి కలిసి పోతారట. మరి ఇంతకీ ఇద్దరి మధ్య ఉన్న గొడవ ఏంటి అనే విషయాన్ని సెకండ్ హాఫ్ లో శంకర్ చూపించబోతున్నారని తెలుస్తోంది.

- Advertisement -

“గేమ్ ఛేంజర్” లేటెస్ట్ అప్డేట్
“గేమ్ ఛేంజర్” నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో టెన్షన్ లో ఉన్న మెగా అభిమానులకు “జరగండి” సాంగ్ రిలీజ్ కాబోతోందనే వార్తతో కొత్త ఆశ గురించి. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న “గేమ్ ఛేంజర్” ఫస్ట్ సాంగ్ “జరగండి”ని రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం. నిజానికి ఈ పాటను ఈ ఏడాది మొదట్లోనే రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. కానీ కొన్ని సమస్యల కారణంగా అది వాయిదా పడింది. ఇక ఈ మూవీ అప్డేట్ విషయానికి వస్తే రీసెంట్ గా రామోజీ ఫిలిం సిటీలో లాస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు. పెండింగ్ లో ఉన్న షూటింగ్ ను రాంచరణ్ త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు