Manjummel Boys : ఆ సినిమా వల్ల కమల్ సినిమా రీ రిలీజ్ కి డిమాండ్?

మలయాళం లో గత రెండు వారాల కింద రిలీజ్ అయిన సినిమా మంజుమ్మేల్ బాయ్స్ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. మలయాళం లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అవడమే గాకుండా 80 కోట్ల వసూళ్లను దాటేసి వంద కోట్ల దిశగా దూసుకుపోతుంది ఈ సినిమా. ఇక మార్చి 15న తెలుగులో కూడా రిలీజ్ కి రెడీ అవుతుంది. యూత్ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్న ఈ సినిమా ను ఒక మంచి ఫ్రెండ్షిప్ నేపథ్యంలో తెరకెక్కిన కామెడీ, ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఇక ఈ సినిమా కొడైకెనాల్ లో జరిగిన నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరెకెక్కడం జరిగింది. సినిమాలో అక్కడక్కడా తమిళ ఛాయలు ఉండేసరికి తమిళనాడులో ఈ సినిమా కేరళ లో ఆడుతున్నట్టు, తమిళ్ లో కూడా మంజుమ్మెల్‌ బాయ్స్ సినిమాను తెగ చూసేస్తున్నారట.

కమల్ మూవీ రిఫరెన్స్..

ఇక ఈ సినిమా కథ నేపథ్యంలో కమల్ హాసన్ పాత క్లాసిక్ మూవీని రిఫరెన్స్ గా తీసుకోవడం జరిగింది. కమల్ హాసన్ నటించిన గుణ సినిమా గుర్తుందా. ఆ సినిమా లో ఫేమస్ సాంగ్ “కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే” అనే పాట ను కొడైకెనాల్ లో ఓ గుహ దగ్గర చిత్రీకరించారు అప్పట్లో ఆ మూవీ మేకర్స్. అయితే మంజుమ్మేల్ బాయ్స్ సినిమాలో గుణ మూవీ చూసి ఆ గుహ ని చూద్దామని ప్లాన్ చేసుకుని వెళ్తారు. ఇక ఆ పాట చిత్రీకరించిన గుహ లోనే మంజుమ్మెల్‌ బాయ్స్ కథ నడుస్తుంది. ఆ గుహ లో ఫ్రెండ్స్ కి ఎదురైన పరిస్థితులేంటి? అక్కడ ఏదైనా ప్రమాదం జరిగిందా? ఫైనల్ గా మంజుమ్మేల్ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళారా లేదా అనేది సినిమా కథగా నేపథ్యం.

- Advertisement -

గుణ రీ రిలీజ్ కి హై డిమాండ్..

మలయాళం లో మంజుమ్మెల్‌ బాయ్స్ సినిమా హిట్‌ అవ్వడంతో సినిమా చూసిన ఆడియన్స్ అంతా కమల్‌ హాసన్‌ గుణ సినిమా గురించి చర్చించుకుంటున్నారు. అయితే 1991 లో విడుదలైన కమల్‌ హాసన్ గుణ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచింది. పైగా ఈ సినిమాలో కమల్ ఆల్మోస్ట్ ఒక సైకో లవర్ లా కనిపిస్తాడు. స్క్రీన్ ప్లే మొత్తం చాలా బోరింగ్ గా ఉంటుంది. అయితే ఈ సినిమా లోని పాటలు మాత్రం ప్రేక్షకులకు బాగా ఎక్కాయి. బుల్లి తెర పై వచ్చిన సమయంలో కూడా ఈ సినిమాకి మంచి టీఆర్‌పీ రేటింగ్స్ వస్తాయి.

అయితే ఇప్పుడు కమల్ హాసన్ గుణ ను రీ రిలీజ్ చేయాలని సోషల్ మీడియా లో డిమాండ్‌ చేస్తున్నారు నెటిజన్లు. ఇక కమల్ ఫ్యాన్స్ ఇప్పటికే గుణ రీ రిలీజ్ కోసం ఆ సినిమా నిర్మాతను డిమాండ్‌ చేస్తున్నారట. ఇక మంజుమ్మేల్ బాయ్స్ రిలీజ్ తర్వాత గుణను ఈ మధ్య కాలంలో యూట్యూబ్‌ లో కూడా మళ్ళీ చూస్తున్నారు. ఇక మంజుమ్మెల్‌ బాయ్స్ చూసిన వారయితే ఖచ్చితంగా కమల్‌ గుణ చూడాలని ఆశ పడుతున్నారు. ఇలా డిమాండ్ ఉన్న టైం లోనే రీ రిలీజ్ చేస్తే అప్పుడు నిరాశ పరిచిన గుణ ను, ఇప్పుడు ఆడియన్స్ నెత్తిన పెట్టుకుంటారని బయ్యర్లకు వస్తాయని ట్రేడ్ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. మరి దీనిపై ఆ గుణ మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు