Kantara2 : కాంతార లేటెస్ట్ అప్డేట్.. ఇంకా ఎన్ని రోజులు వర్క్ అంటే?

Kantara2 : కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతార సినిమా ఏ రేంజ్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెజిఎఫ్ సిరీస్ తర్వాత కన్నడలో ఆ స్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లు అందుకున్న సినిమా ఇది. చిన్న సినిమాగా విడుదలై, పాన్ ఇండియా వైడ్ గా సంచలన విజయం సాధించింది. రెండేళ్ల కింద విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 370 కోట్ల వసూళ్ళని అందుకుంది. ఇక అప్పట్లోనే ఈ సినిమా హీరో కం దర్శకుడు రిషబ్ శెట్టి కాంతారా సీక్వెల్ వస్తుందని ప్రకటించాడు. అన్నట్టుగానే తొందరగా సీక్వెల్ సినిమా స్టార్ట్ చేసి ఏకంగా ఫస్ట్ లుక్ గ్లింప్స్ కూడా వదిలాడు. ఆ వీడియో సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సీక్వెల్ పై అంచనాలు విపరీతంగా పెంచేసింది.

Rishabh Shetty Kantara2 Shooting Latest Update

ఫినిషింగ్ స్టేజ్ కి కాంతార…

ఇక తాజాగా కాంతారా సీక్వెల్ పై లేటెస్ట్ గా క్రేజీ అప్డేట్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ 80 శాతానికి పైగా పూర్తి చేసుకున్న ఈ సినిమా యూనిట్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం కాంతారా2 సినిమా షూటింగ్ చివ‌రిద‌శ‌కు చేరుకుంద‌ని.. మ‌రో 20 రోజుల్లో ఈ చిత్ర షూటింగ్ ముగుస్తుంద‌ని తెలుస్తోంది. ఇక షూటింగ్ పూర్తవగానే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు స్టార్ట్ చేసి ఈ చిత్రాన్ని సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

500 కోట్ల రేంజ్ సినిమాగా ప్లాన్…

ఇక రిషబ్ శెట్టి నటించిన కాంతారా బాక్స్ ఆఫీస్ వద్ద 370 కోట్ల వసూళ్ళని అందుకోగా పెట్టుబడికి ఆల్మోస్ట్ 8 రెట్ల లాభం తెచ్చిపెట్టిందట. ఇక కాంతారా సినిమాతో ఈ సారి ఐదువందల కోట్లు వచ్చేలా మేకర్స్ ప్రమోషన్స్ చేయనున్నారు. వంద కోట్లకి పైగా బడ్జెట్ తో రూపొందుతున్న కాంతారా సీక్వెల్ కి రిలీజ్ టైం నాటికి మరో యాభై కోట్లు ఎక్కువ కూడా కావచ్చని అంచనా. ఇక ఈ సినిమాకు భారీ వీఎఫ్ఎక్స్ వ‌ర్క్ జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తోంది. కాంతారా సినిమాని 2025 సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుండగా, ఈ సారి పాన్ ఇండియా భాషల్లో ఒకేసారి భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు