Rithu chowdhary: అసభ్యకర పదజాలంతో టార్చర్ చేశారు – రీతూ చౌదరి..!

జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న లేడీ కమెడియన్ రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకానొక సమయంలో సీరియల్స్ లో కూడా నటించి ప్రేక్షకులను అలరించిన ఈమె జబర్దస్త్ వచ్చిన తర్వాత మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ అభిమానులతో టచ్ లో ఉండే రీతూ చౌదరి గత కొద్దిరోజుల క్రితం తన తండ్రి మరణించడంతో తన కుటుంబానికి అన్ని తానే అయి చూసుకుంటుంది. అంతేకాదు తన తండ్రి ఉన్నప్పుడు నిర్మించుకోవాలనుకున్న తన డ్రీమ్ హౌస్.. ఇంటీరియర్ పనులు ఆగిపోవడంతో ఇప్పుడు మళ్లీ ఆ పనులు చేపట్టింది. అయితే ఆ ఇంటి విషయంలోనే మానసిక ఆందోళనకు గురయ్యానని చెబుతూ తన యూట్యూబ్ ఛానల్ లో చెప్పుకొచ్చింది.

ఇప్పుడు మరో చేదు అనుభవాన్ని రీతూ చౌదరి పంచుకుంది. తాజాగా సోషల్ మీడియాలో మార్ఫింగ్ వీడియోలు చేస్తున్న ఆకతాయిని పోలీసులు పట్టుకున్నారని తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియో ని కూడా తన యూట్యూబ్ ఛానల్ లో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.. రీతూ చౌదరి మాట్లాడుతూ.. నా ఫోటోలను, వీడియోలను ఎవరో మార్ఫింగ్ చేశారు. వీడియోలను మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అంతేకాదు నన్నే ట్యాగ్ చేసి పైశాచిక ఆనందం పొందారు. సోషల్ మీడియాలో నేను ఏం పెట్టినా సరే చాలా దారుణంగా కామెంట్లు చేశారు. ఇలా ఐదు నెలలు అవుతుంది.. ఈ విషయాన్ని బయటకు చెప్పాలా? వద్దా? అని నాలో నేనే ఎన్నోసార్లు బాధపడ్డాను.. బయటకు చెబితే ఏమవుతుందో అని భయపడ్డాను.. ఇక ఈ వీడియో చేయడానికి కూడా ఆలోచించాను.. కానీ ఇప్పుడు చేయక తప్పడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

నేను, శ్రీకాంత్ బయటకు వెళ్లేటప్పుడు ఇలాంటి వీడియోలు చూసి అతనికి చెప్పాలా? వద్దా ? అని కుమిలిపోయాను.. ఇది చూసిన శ్రీకాంత్ నువ్వు కానప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పాడు. నన్ను ట్యాగ్ చేసే వరకు ఇలాంటి వీడియోలు చేశారని నాకు తెలియదు. కానీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ వీడియోలను ఇచ్చాను. మా నాన్న పోయాక తిరిగి కోలుకునే లోపే మళ్ళీ ఇలా జరగడం మరింత బాధ కలిగిస్తుంది. అసభ్యకర పదజాలంతో నన్ను మరింత టార్చర్ చేస్తున్నారు అంటూ బాధపడింది రీతూ చౌదరి. అంతేకాదు ఈ విషయంలో తనకు అండగా నిలిచిన విష్ణు ప్రియా కి కూడా ధన్యవాదాలు తెలిపింది రీతూ చౌదరి.

- Advertisement -

ఇకపోతే అతడిని పోలీసులు పట్టుకోగా..అతడిని ముందే నేను కలిశాను ఎందుకిలా చేశావని అడిగితే నాకు తెలియదు మేడం అంటున్నాడు.. అతడికి ఇద్దరు అక్కలు కూడా ఉన్నారట.. అతని బావ వచ్చి చిన్న పిల్లాడు మేడం వదిలేయండి అని సిగ్గులేకుండా అడిగాడు అంటూ చౌదరి చెప్పుకొచ్చింది. అంతేకాదు ఇలాంటివి ఎవరైనా ఎదుర్కొంటే భయపడకుండా.. సూసైడ్ చేసుకునే వరకు వెళ్లకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళండి అంటూ రీతూ చౌదరి తెలిపింది.

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు