Roja.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన సీనియర్ హీరోయిన్ రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాజీ మంత్రిగా కూడా ఈమె పేరు దక్కించుకుంది. చిత్ర పరిశ్రమలో, రాజకీయ రంగంలో చెరగని ముద్ర వేసుకుంది. ముఖ్యంగా నటిగా ఈమెకు ఉన్న ఫేమ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బాలకృష్ణ, చిరంజీవి, శ్రీకాంత్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. తెలుగు , తమిళ్ భాషల్లో తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకుంది. ఒకవైపు రాజకీయాలలో ఎమ్మెల్యేగా కొనసాగుతూనే మరొకవైపు జబర్దస్త్ వంటి బుల్లితెర షో లకు జడ్జిగా కూడా వ్యవహరించింది.
అధికార గర్వంతో స్టార్ హీరోలపై కామెంట్స్..
హీరోయిన్గా అవకాశాలు తగ్గినప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అవుతుందని అందరూ అనుకున్నారు.. కానీ ఊహించని విధంగా నెగిటివిటీ మూటగట్టుకుంది. 2014, 2019లో నగరి ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన ఈమె 2022లో మంత్రిగా పదవీ స్వీకారం చేసిన తర్వాత నెగిటివిటీ పెరిగిపోయింది..ముఖ్యంగా 2024 ఎన్నికల ప్రచారంలో మెగాస్టార్ చిరంజీవి , పవన్ కళ్యాణ్, రజినీకాంత్ లపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వారి అభిమానులు ఈమెపై పూర్తిస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేకాదు ఇండస్ట్రీ నుంచి వచ్చి, ఇండస్ట్రీకి చెందిన హీరోలపై ఇలా నెగిటివ్ కామెంట్లు చేయడంతో రోజాకు చిత్ర పరిశ్రమలో ఎవరు కూడా అండగా నిలవలేదు.
అవకాశాల కోసం పాకులాడుతున్న రోజా..
ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు తమ పార్టీనే మళ్ళీ అధికారంలోకి వస్తుందని ,ఎమ్మెల్యేగా గెలుస్తుందని భావించి నోటికొచ్చినట్టు మాట్లాడింది.కానీ ఊహించని విధంగా రోజా ఓటమిపాలైంది. అయితే ఆ షాక్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈమె మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే వెండితెర, బుల్లితెరపై అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇక్కడ ఈమెకు ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయట. గతంలో ఇండస్ట్రీ నే ఈమె విమర్శించింది. ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీలో అవకాశం అంటే దర్శక నిర్మాతలు కూడా వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం..
కోలీవుడ్ లో కూడా చుక్కెదురు..
తెలుగు విషయాన్ని పక్కన పెడితే , కోలీవుడ్ లో కూడా రోజూ చుక్కేదురైనట్లు తెలుస్తోంది. అక్కడ కూడా అవకాశాల కోసం ట్రై చేస్తుంటే, సరైన రెస్పాండ్ రావడం లేదని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం దీనిపై చాలామంది రకరకాల కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.అధికార గర్వంతో విర్రవీగిన రోజా అప్పుడు అలాంటి కామెంట్లు చేసింది. ఇప్పుడు అవకాశాల కోసం పాకులాడుతోంది. పాపం రోజా అంటూ చాలామంది నటిజెన్లు ఇలా రకరకాల చేస్తున్నారు.అందుకే అధికారంలో ఉన్నా లేకపోయినా ఎవరిని కించపరచకూడదు. అవకాశాలు లేక రాజకీయాలలో పదవులు లేక ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఈమె భర్త సెల్వమని డైరెక్టర్. మరి ఈయన దర్శకత్వంలోనైనా ఈమెకు అవకాశం లభిస్తుందో లేదో చూడాలి. మొత్తానికైతే రోజా పరిస్థితి ఎటు కాకుండా పోయిందని చెప్పడంలో సందేహం లేదు.