Ruhani Sharma : అక్కడికెళ్ళి కూడా గుడ్డు కావాలా నాయన.. అంటూ పోజులిస్తుందేంటి!

Ruhani Sharma : టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్లలో రుహాణి శర్మ ఒకరు. ఏడేళ్ల కింద ‘చిలసౌ’ అనే చిన్న సినిమా తో పరిచయమైన ఈ భామ తొలిచిత్రంతోనే మంచి విజయం అందుకోవడమే కాకుండా, తన డీసెంట్ నటనతో ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇక ఆ సినిమా తర్వాత వరుస ఆఫర్లను తెలుగులో అందుకుంది. ఈ సినిమా తర్వాత వచ్చిన ‘హిట్’ మూవీలో ఈ అమ్మడు పోషించిన పాత్రకు కూడా మంచి గుర్తింపు దక్కింది. అంతే కాకుండా ఆ తర్వాత నటించిన కొన్ని సినిమాలు కూడా అంతగా ఆడకపోయినా ఈ అమ్మడికి మంచి ఇమేజ్ ను తెచ్చి పెట్టాయి. అయితే కమర్షియల్‌ హిట్స్ పడక పోవడంతో స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు సొంతం చేసుకోలేక పోతుంది. ఇక ఈ ఏడాది మూడు సినిమాల్లో మంచి పాత్రల్లో నటించింది రుహని. కానీ లక్ బాగాలేకో ఏమో మూడు సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి. అయినా అడపాదడపా ఈ అమ్మాయికి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో మాత్రం సినిమా చేయడానికి రెడీ అయింది. తాజాగా ఓ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ లో రుహని శర్మ (Ruhani Sharma) వెరైటీగా ఫోజులిస్తూ ట్రెండ్ అవుతుంది.

Ruhani Sharma Starrer's Black Out Movie Look iral On Social Media

గుడ్డు కావాలా నైనా…

ఇక రుహాణి శర్మ నార్త్ బ్యూటీ నే అయినా బాలీవుడ్ సినిమాల్లో ఎంట్రీ మాత్రం లాస్ట్ ఇయర్ లోనే అడుగుపెట్టింది. ‘ఆగ్రా’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ విమర్శకుల ప్రశంసలందుకుంది. ఇక తాజాగా మరో బాలీవుడ్ సినిమా చేయడానికి రెడీ అయిపొయింది. తాజాగా రుహాణి శర్మ హీరోయిన్ గా “బ్లాక్ ఔట్‌” అనే సినిమాలో నటిస్తుంది. తాజాగా ఆ సినిమాకి సంబంధించిన రుహాణి శర్మ పాత్ర లుక్ వైరల్ అవుతుంది. ఈ సినిమా లో రుహానీ శర్మ ను గ్లామర్‌ పాత్రలో చూడబోతున్నట్లుగా ఫస్ట్‌ లుక్ చూస్తే అర్థం అవుతుంది. క్లీ వేజ్‌ షో తో ‘గుడ్డు కావాలా నాయనా’ అన్నట్లుగా ఫోజ్ ఇచ్చిన రుహానీ శర్మ యొక్క ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌ లో ఆఫర్లు సొంతం చేసుకుంటున్న ఈ అమ్మడు ముందు ముందు అక్కడే బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఈ అమ్మడు నటించిన శ్రీరంగ నీతులు బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపించడం లో విఫలం అయ్యింది.

- Advertisement -

అక్కడ క్లిక్ అయితే సెట్ అవుతుందా?

ఇక బ్లాక్ అవుట్ సినిమాలో రుహాణి శర్మ మెయిన్ హీరోయిన్ కాకపోయినా ఆ సినిమాలో కీ రోల్ ప్లే చేసిందట. అయితే బ్లాక్ అవుట్ సినిమా థియేటర్లలో కాకుండా జియో ఓటిటి లో రిలీజ్ అవుతుంది. అయినప్పటికీ ఆ సినిమా క్లిక్ అయితే రుహాణి శర్మ కి బాలీవుడ్ నుంచి ఆఫర్లు రావడం ఖాయం అంటున్నారు నెటిజన్లు. ఇక రుహాణి శర్మ కి సినిమాల్లో హీరోయిన్ గా ఎక్కువగా ఆఫర్లు రాకపోయినా, ప్రత్యేకమైన ఇంపార్టెంట్ రోల్స్ బాగా వస్తున్నాయి. తెలుగులో ఇప్పటికే ఆపరేషన్ వాలెంటైన్, సైన్ధవ్ వంటి సినిమాల్లో మంచి పాత్రల్లో నటించింది. ఇక అప్పుడప్పుడూ క్రేజీ ఫోటోషూట్లు చేస్తూ ఆఫర్ల కోసం మేకర్స్ కి ఎరేస్తుంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు