Nikhil: రూమర్స్ కి చెక్ పెట్టిన ‘స్పై’ – రిలీజ్ ఎప్పుడంటే..?

కార్తికేయ2 సినిమా ద్వారా పాన్ ఇండియా హిట్ అందుకున్న హీరో నిఖిల్, ఎడిటర్ గ్యారీ డైరెక్షన్లో రూపొందిన స్పై సినిమా విడుదలకి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. సినిమా ప్రొడ్యూసర్ కి, నిఖిల్ కి ప్రమోషన్స్ విషయంలో ఏర్పడ్డ విభేదాలే ఇందుకు కారణం అని టాక్ వినిపించింది. తాజాగా ఆ రూమర్లకు చెక్ పెడుతూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది సినిమా యూనిట్. ముందుగా అనౌన్స్ చేసినట్టు జూన్ 29నాడే సినిమా రిలీజ్ అవుతుందని కన్ఫార్మ్ చేసింది. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కి ప్లాన్ చేసిన ఈ సినిమా ప్రమోషన్స్ ఇంకా మొదలు పెట్టలేదు సినిమా యూనిట్. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఆదిపురుష్ సినిమా రిలీజ్ ఉండటమే ఇందుకు కారణం.

అయితే, ఆదిపురుష్ కి మిక్స్డ్ టాక్ రావటం నిఖిల్ స్పై సినిమాకి ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. రిలీజ్ కి పదిరోజులకు పైగా సమయం ఉన్నందున ఇప్పటినుండి ముమ్మరంగా ప్రమోషన్స్ చేస్తే జనాల్లో సినిమా రిజిస్టర్ అయ్యే అవకాశం ఉంది. కార్తికేయ2 ద్వారా నార్త్ ఆడియెన్స్ కి నిఖిల్ పరిచయం అయ్యాడు కాబట్టి ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది.

నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ,కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆర్యన్ రాజేష్, మకరంద్ దేశ్ పాండే ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచిన నేపథ్యంలో నిఖిల్ మరొక పాన్ ఇండియా హిట్ అందుకుంటాడా లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు