Sai Pallavi: నా తల్లిదండ్రుల టార్చర్ భరించలేకపోయా.. హాట్ కామెంట్స్ చేసిన లేడీ పవర్ స్టార్..!

Sai Pallavi.. మలయాళ సినీ ఇండస్ట్రీకి చెందిన సాయి పల్లవి (Sai Pallavi) తోలుత బుల్లితెర ఛానల్ లో ప్రసారమైన ఢీ డాన్స్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొని, టైటిల్ విన్నర్ గా నిలిచింది. అప్పట్లోనే తన డాన్స్ మెలుకువలతో అందరినీ ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఉన్నత విద్యపై దృష్టి సారించింది. ఆ తర్వాత ప్రేమమ్ (Premam)సినిమాతో మలయాళ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయి పల్లవి, అక్కడ ఆ సినిమా విజయం సాధించడంతో.. తెలుగులో శేఖర్ కమ్ముల (Sekhar kammula)దర్శకత్వంలో వరుణ్ తేజ్ (Varun tej)హీరోగా నటించిన ఫిదా(Fidaa )సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. ఈ సినిమాతో తొలి పరిచయంలోనే ఆడియన్స్ హృదయాలను కొల్లగొట్టింది ఈ ముద్దుగుమ్మ.

Sai Pallavi: I could not bear the torture of my parents.. The lady power star who made hot comments..!
Sai Pallavi: I could not bear the torture of my parents.. The lady power star who made hot comments..!

గ్లామర్ షో కి దూరంగా..

సావిత్రి , సౌందర్య తర్వాత అంత పేరు దక్కించుకున్న సాయి పల్లవి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ తన నటనతో మెప్పిస్తోంది. గ్లామర్ ప్రపంచంలో అందాలు వొలకబోస్తేనే అవకాశాలు వస్తాయి అని అనుకునే వారికి దీటుగా నటనాప్రతిభ ఉంటే చాలు గ్లామర్ షో చేయాల్సిన అవసరం లేదు అంటూ నిరూపిస్తోంది. అంతేకాదు కథా ప్రాముఖ్యత ఉంటేనే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. కథ నచ్చకపోయినా, హీరో నామినేషన్ ఉన్నా సరే , ఎదుట ఉన్నది స్టార్ హీరో ,సూపర్ స్టార్ అయినా సరే నిర్మొహమాటంగా రిజెక్ట్ చేస్తూ ఉంటుంది సాయి పల్లవి. అంతేకాదు తన సినిమాల ద్వారా నిర్మాతలకు నష్టం వస్తే ఆదుకోవడంలో ముందుంటుంది.

తల్లిదండ్రుల టార్చర్ భరించలేకపోయా..

అయితే ఇలాంటి ఈమెను ఎవరూ కూడా ఇబ్బంది పెట్టాలని ఆలోచించరు. కానీ ఈమె తల్లిదండ్రులు ఈమెను బాగా టార్చర్ చేశారట. తల్లిదండ్రుల టార్చర్ భరించలేక ఇంటి నుండి బయటకు రావాలని కూడా అనుకుందట సాయి పల్లవి.. ఇక సాయి పల్లవిని ఆమె తల్లిదండ్రులు ఎందుకు అంత టార్చర్ చేశారు అనే విషయాన్నికొస్తే.. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి అసలు విషయాన్నీ వెల్లడించింది.

- Advertisement -

పెళ్లి చేసుకోమని టార్చర్ చేశారు..

కరోనా సమయంలో దాదాపు రెండు నుండి మూడు సంవత్సరాలు అందరూ ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే సాయి పల్లవిని పెళ్లి చేసుకోవాలని ఆమె తల్లిదండ్రులు బాగా టార్చర్ చేశారట. అంతేకాదు కజిన్ సిస్టర్స్ అందరి వివాహం జరిగిపోయింది నువ్వు ఎప్పుడు వివాహం చేసుకుంటావు అంటూ తెగ టార్చర్ పెట్టారట. ఇక దీంతో టార్చర్ తట్టుకోలేక నేను సాధించాల్సింది చాలా ఉంది. అప్పుడే పెళ్లి చేసుకోవడం కుదరదు అంటూ గట్టిగా తన తల్లిదండ్రులతో చెప్పినట్లు సమాచారం. ఇకపోతే సాయి పల్లవి ఇటీవలే తన చెల్లెలు పూజా పెళ్లి ఘనంగా జరిపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈమె ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంది అంటూ అభిమానులు సైతం తెగ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమని చెప్పడం మీకు టార్చర్ గా అనిపించిందా అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు