Prabhas: సలార్ మరో దళపతిలా ఉండబోతుందా?

ప్రభాస్ నటించిన ఆదిపురుష్ హడావిడి దాదాపు ముగిసినట్టే అనిపిస్తుంది. జూన్ 16న విడుదలైన ఆ సినిమా డిజాస్టర్ టాక్ ను మూట గట్టుకుంది. మొదటి వీకెండ్ బాగానే ఆడినా, ఆ తర్వాత వివాదాలు చుట్టుముట్టాయి. ఇప్పుడు ఆదిపురుష్ ని బ్యాన్ చేయమని రామ భక్తులు అంటున్నారు. అయితే ప్రభాస్ మాత్రం సినిమా రిజల్ట్ గురించి పట్టించుకోకుండా తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టాడని తెలుస్తుంది.

ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో సెట్స్ పై ఉన్న క్రేజీ సినిమా సలార్. కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే సగానికి పైగా ఈ సినిమా షూటింగ్ అయిపోగా త్వరలోనే హైదరాబాద్ లో భారీ సెట్టింగ్ వేసి షూటింగ్ జరుపనున్నారు. ఆదిపురుష్ హడావిడి అయిపోగానే జూన్ మూడో వారంలో ప్రభాస్ ఈ సెట్స్ లో అడుగుపెట్టనున్నాడు. అయితే సలార్ సినిమాకు సంబంధించి ఒక తాజా సమాచారం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆ న్యూస్ విన్న అభిమానులు చాలా హ్యాపీగా ఉన్నారు.

సలార్ సినిమా హై యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఫ్రెండ్షిప్ నేపథ్యంలో వస్తున్న సినిమా అని తాజాగా చిత్ర యూనిట్ నుండి అనధికారంగా సమాచారం అందింది. సింపుల్ గా చెప్పాలంటే దళపతి సినిమా తరహాలో సలార్ కథ ఉంటుందని అంటున్నారు. కేజిఎఫ్ ను తల్లీ కొడుకుల సెంటిమెంట్ తో తీసిన ప్రశాంత్ నీల్, ఇప్పుడు స్నేహితుల సెంటిమెంట్ తో సలార్ సినిమాతో వస్తున్నాడన్నమాట. ఈ వార్త విన్న ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ సినిమాతో ప్రభాస్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టి పవర్ఫుల్ కంబ్యాక్ ఇస్తాడని అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు