Samantha: నాగచైతన్య సినిమాలో మళ్లీ సమంత ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ హీరోయిన్ సమంతకు ఉన్న ఫాలోయింగ్ అంతా కాదు. ఇండస్ట్రీలోకి సమంత వచ్చి చాలా సంవత్సరాలు దాటిపోయింది. అయినప్పటికీ సమంతకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. తెలుగులోనే కాకుండా తమిళ్, ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా చాన్సులు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది సమంత.

ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో సమంత అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బంపర్ హిట్ కావడమే కాకుండా… ఆమె లైఫ్ కూడా పూర్తిగా మారిపోయింది. అక్కినేని నాగచైతన్య ప్రేమలో పడిపోయింది సమంత. ఆ తర్వాత వీరిద్దరి ప్రేమ వివాహం జరిగి.. విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. 2017 సంవత్సరంలో పెళ్లి చేసుకున్న ఈ జంట… 2021 లో విడిపోయారు.

ఇక ప్రస్తుతం సమంత మరియు అక్కినేని నాగచైతన్య వేరువేరు గానే ఉంటున్నారు. గతంలో ఈ ఇద్దరు కలిసి చాలా సినిమాలలోనే నటించారు. విడాకుల తర్వాత మాత్రం నాగచైతన్య మరియు సమంత సినిమాలు కలిసి చేయడం లేదు. ఇలాంటి నేపథ్యంలో తాజాగా ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల దూత అనే సినిమా లో (వెబ్ సీరీస్) అక్కినేని నాగచైతన్య నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సీక్వల్ కూడా వస్తుంది. అయితే ఇందులో సమంత ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం అందుతుంది. ఈ మేరకు సమంత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు