Samantha : ఎట్టకేలకు ఖుషికి టైం ఇచ్చింది

సమంత మయోసైటిస్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. అటు శాకుంతలం సినిమా ప్రమోషన్ లలో పాల్గొనడం తో పాటు బాలీవుడ్ లో సామ్ మొట్ట మొదటి సారి నటించబోతున్న సిటాడెల్ వెబ్ సిరీస్ కు కూడా టైం కేటాయించింది. అంతే కాదు.. ఈ సిరీస్ సెట్స్ లో కూడా సామ్ పాల్గొంది. దానికి సంబంధించిన ఫోటోలను బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే.

అలాగే సామ్, చాలా రోజుల తర్వాత జిమ్ కఠిన వర్క్ అవుట్స్ కూడా చేసింది. దానికి సంబంధించిన వీడియోలను సామ్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఫోస్ట్ చేసింది. ఆ వీడియో వైరల్ కూడా అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, మయోసైటిస్ వల్ల నటనకు గ్యాప్ ఇచ్చిన సామ్, తాజాగా తాను ముందుగా ఒప్పుకున్న సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే శాకుంతలం సినిమా ప్రమోషన్లు, సిటాడెల్ షూటింగ్ లో పాల్గొంటున్న సమంత, తాజాగా ఖుషి సినిమా షూటింగ్ కు కూడా రెడీ అయినట్టు తెలుస్తోంది.

మజిలి సినిమా దర్శకుడు శివ నిర్వాణ ఖుషి ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండగా, సామ్ హీరోయిన్ గా చేస్తోంది. దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. అయితే సమంతకు మయోసైటిస్ వ్యాధి రావడం వల్ల ఈ సినిమా తాత్కాళికంగా వాయిదా పడింది. అయితే ప్రస్తుతం సామ్ కోలుకోవడంతో ఖుషి మళ్లీ పట్టాలెక్కబోతుంది.

- Advertisement -

ఖుషి సినిమా కోసం సమంత ఫిబ్రవరి నెలలో 12 నుంచి 15 రోజుల డేట్స్ ఇచ్చిందని సమాచారం. ఈ రెండు వారాల్లో విజయ్ దేవరకొండ, సమంత లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దీని తర్వాత సామ్ పై మళ్లీ మార్చిలో మరో షెడ్యూల్ ఉండే అవకాశాం ఉందట. మార్చి లో షూటింగ్ ను క్లోజ్ చేసి, సమ్మర్ కానుకగా ఖుషిని ప్రేక్షఖుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు