Samantha : స్టైలిష్ గా ఫోజులతో అల్లాడిస్తున్న సామ్..!

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పద్నాలుగేళ్ల కింద “ఏ మాయ చేసావే” అంటూ వచ్చి నిజంగానే ప్రేక్షకులను మాయ చేసి, తెలుగు ఇండస్ట్రీ లో తిష్ట వేసింది. టాలీవుడ్ లో స్టార్ హీరోలతో నటిస్తూ, స్టార్ హీరోయిన్ గా కొనసాగిన సామ్ కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా ఫిమేల్ సెంట్రిక్ చిత్రాలతో కూడా తన సత్తాను చాటుతుంది. అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్న సమంత, కొన్నాళ్ళు సినిమాలకు కూడా గ్యాప్ ఇచ్చింది. ఆ తర్వాత కోలుకుని మళ్ళీ యశోద, శాకుంతలం, ఖుషి వంటి సినిమాలతో ఆడియన్స్ ని పలకరించింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, తన ఫాలోవర్లతో ఎప్పటికప్పుడు పిక్స్, వీడియోస్ షేర్ చేస్తూ, వారి మనసులు గెలుచుకుంటోంది. ఇక ఇటీవల షేర్ చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి.

Samantha Latest photoshoots viral on social media

అల్ట్రా స్టైలిష్ గా సమంత..

ఇక తాజాగా సమంత షేర్ చేసిన ఫోటోషూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్టైలిష్ గ్లామర్ డ్రెస్సులో అమ్మడు తన అందంతో ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. మరికొన్ని ఫొటోలలో సింపుల్ మరియు అట్రాక్టివ్‌గా కనిపిస్తూ, తన లుక్స్ తోనే మాయ చేసేస్తోంది. ఇక ఆ పోటోలను చూసిన ఫాలోవర్స్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. అల్ట్రా స్టైలిష్ అంటూ ఈ గ్లామర్ వరల్డ్ లో సమంతను కొట్టే వారే లేరు అంటున్నారు. ఇక సమంత త్వరలోనే “సిటాడెల్” వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించనుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్‌ ను రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ కోసం సమంత ఎంతో కష్టపడ్డారు. అలాగే, తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పై “మా ఇంటి బంగారం” సినిమాను అనౌన్స్ చేసింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు.

- Advertisement -

సినిమాలు, ఫోటోషూట్లతో బిజీ..

ఇక సమంత (Samantha) తన కెరీర్‌లో ఎన్నో మలుపులు చూసినప్పటికీ, తను తిరిగి నిలబడేందుకు ప్రయత్నిస్తుందని చెప్పాలి. లాస్ట్ ఇయర్ ఒకే సినిమాలో నటించిన సామ్ ఈ ఇయర్ లో నాలుగేసి ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అన్నిటికి మించి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 35 కి మిలియన్ల కి పైగా ఫాలోవర్లు ఉన్నారంటేనే తెలుస్తుంది తనకి ఏ రేంజ్ లో ఫాలోవర్లు అభిమానులు ఉన్నారో. ఇక ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రాజెక్టులతో, తన అభిమనులను ఆశ్చర్యపరుస్తూ ముందుకు సాగుతోంది. మరి మునుపటిలా స్టార్ హీరోల సినిమాల్లో ఎప్పుడు బిజీ అవుతుందో చూడాలి. అయితే ఒకప్పుడు దూకుడు, అత్తారింటికి దారేది, రంగస్థలం, మజిలి వంటి బ్లాక్ బస్టర్ల తో రచ్చ చేసిన సామ్ మళ్ళీ ఆ రేంజ్ లో అయితే హిట్ దక్కించుకోలేదనే చెప్పాలి. మరి రాబోయే చిత్రాలతో ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో చూడాలి.

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు