Samantha: మళ్లీ పెళ్లికి సిద్ధమా.. దాని అర్థం ఏంటి..?

Samantha.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న సమంత గురించి చెప్పాల్సిన పనిలేదు. అద్భుతమైన నటనతో తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఈమె తెలుగు స్టార్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించింది. ముఖ్యంగా తెలుగు , తమిళ్ ఆడియన్స్ ను తన అద్భుతమైన నటనతో మెప్పించిన సమంత , ఈ మధ్య హిందీలో కూడా నటిస్తూ బిజీ అయిపోయింది. ది ఫ్యామిలీ మెన్ సిరీస్ తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సమంత.. ఈ సిరీస్ తో మంచి సక్సెస్ అందుకొని ఇటీవలే సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది. త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

Samantha: Ready to get married again.. What does that mean..?
Samantha: Ready to get married again.. What does that mean..?

నాగచైతన్య తో ప్రేమ, పెళ్లి , విడాకులు..

ఇకపోతే సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడం వల్ల నాలుగు సంవత్సరాలకే విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం ఎవరి కెరియర్ లో వారు బిజీ అయిపోయారు. ఇక సమంత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది.. చికిత్స కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంది. దీనికి తోడు ఒక ఏడాది పాటు విశ్రాంతి తీసుకుంది. ఇటీవలే ఈ ఎంట్రీ ఇచ్చి. నిర్మాతగా మారి మా ఇంటి బంగారం అనే సినిమాను నిర్మిస్తోంది.. నాగచైతన్య మాత్రం సమంత నుంచి విడిపోయిన మరుసటి ఏడాది శోభితతో ఎఫైర్ పెట్టుకొని తాజాగా ఆగస్టు 8వ తేదీన నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే పెళ్లికి సిద్ధమవుతున్నారు.

సమంత మళ్లీ పెళ్లికి సిద్ధమా..

ముఖ్యంగా వీరిద్దరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను నాగార్జున ఎక్స్ వేదికగా ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. వారం రోజులపాటు ఎక్కడ చూసినా వీరిద్దరి గురించే చర్చ.. దీనికి తోడు సమంత కూడా ఒక స్టార్ డైరెక్టర్ తో డేటింగ్ లో ఉన్నట్లు పుకార్లు వినిపించాయి. అభిమానులు మాత్రం దీనిని ఖండించే ప్రయత్నం చేశారు. ఇలాంటి సమయంలో సమంత పెడుతున్న పోస్టులు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇక సమంత పెడుతున్న పోస్ట్లు చూస్తుంటే అందరిలో రకరకాల చర్చలు లేవనెత్తేలా చేస్తున్నాయని చెప్పవచ్చు.

- Advertisement -

సమంత పోస్ట్ కు అర్థం ఏమిటి..?

ఇకపోతే తాజాగా సమంత ఇన్స్టా వేదికగా ఒక పోస్ట్ పంచుకుంది. త్వరలో స్పెషల్ న్యూస్ రాబోతోంది అంటూ ప్రకటించడంతో అందరూ అయోమయంలో పడిపోయారు. “రెడీగా ఉండండి.. ఈరోజు సంథింగ్ స్పెషల్ రాబోతోంది.. అంటూ రాసుకుంది సమంత. అలాగే ఒక వాడిపోయిన ఆకులున్న కొమ్మ ఫోటోని కూడా షేర్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత పెట్టిన ఈ పోస్టు చర్చనీయాంశంగా మారింది అని చెప్పవచ్చు. అయితే ఇది చూసిన కొంతమంది బిజినెస్ అప్డేట్ ఇస్తోందా? లేక తన పర్సనల్ లైఫ్ గురించి ఏదైనా చెప్పబోతోందా అంటూ మాట్లాడుకుంటున్నారు.

సమంత పోస్ట్ పై నెటిజన్స్ కామెంట్స్..

అంతే కాదు మరి కొంతమంది నాగచైతన్య లాగే సమంత కూడా సడన్ గా నిశ్చితార్థం చేసుకొని ఆ విషయాన్ని చెప్పబోతోందా? అంటూ కూడా తమ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సమంత చెప్పబోయే కొత్త స్పెషల్ వార్త ఏంటో తెలియాలి అంటే ఈ విషయంపై మళ్ళీ ఆమె స్పందించే వరకు ఎదురు చూడాల్సిందే.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు