Samantha: చైతూ ఇంటికెళ్లిన సమంత తండ్రి.. ఏం జరిగిందో వింటే షాక్..!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha)ను మొదట ప్రేమించి వివాహం చేసుకున్నారు అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya). అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2021 అక్టోబర్ రెండవ తేదీన విడాకులు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. అయితే ఎవరికి వారు కెరియర్ లో బిజీ అయ్యారు కానీ నాగచైతన్య మాత్రం అనూహ్యంగా హీరోయిన్ శోభిత(Sobhita)తో ఎఫైర్ నడిపి ఆగస్టు 8వ తేదీన నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక నాగచైతన్య కావాలనే సమంతను పక్కా ప్లానింగ్ తో సైడ్ చేసి ఈమెను వివాహం చేసుకోబోతున్నారు అంటూ ఇప్పటికే సమంత అభిమానులు కామెంట్లు వైరల్ చేసిన విషయం తెలిసిందే.

Samantha: Sam's father who moved to Chaitu's house.. Shocked to hear what happened..!
Samantha: Sam’s father who moved to Chaitu’s house.. Shocked to hear what happened..!

అక్కినేని ఇంటికి వెళ్లిన సమంత తండ్రి..

అయితే ఇదిలా ఉండగా తాజాగా ఇప్పుడు సమంతకు సంబంధించిన మరొక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.అదేమిటంటే సమంత తండ్రి తన కూతురుకి జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక నాగార్జున ఇంటికి వెళ్లి భారీ షాక్ ఇచ్చారట. అంతేకాదు శోభితాను నాగచైతన్య వివాహం చేసుకోవడంలో తప్పులేదు కానీ అక్కినేని ఫ్యామిలీ కారణంగా సోషల్ మీడియాలో ఇలా నా కూతుర్ని ఇబ్బంది పెట్టడం ఏ మాత్రం బాగోలేదంటూ సమంత తండ్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సమంత ఒంటరిగా తన జీవితాన్ని గడుపుతోంది చాలా రోజుల నుంచి మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈమె ఇలా బాధపడుతున్నప్పటికీ అక్కినేని ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా ఆమె ఆరోగ్యం గురించి పరామర్శించలేదని ఆయన ఫైర్ అయ్యారట.

కూతురికి జరిగిన అన్యాయాన్ని తలుచుకొని ఎమోషనల్..

దాదాపు నాలుగు సంవత్సరాలు మీ కుటుంబంతో ఉండి, మీ బాధ్యతలన్నీ తన భుజాల మీద వేసుకున్న నా కూతుర్ని ఎవరు లేని ఒక అనాధగా మార్చేశారు. ఆమె తన ప్రేమను మూగ జంతువులపై చూపించుకునేంతలా మానసిక క్షోభకు గురి చేశారు. ఇదెక్కడి న్యాయం అంటూ ఆయన నిలదీశారట. అంతేకాదు అక్కినేని ఫ్యామిలీ చెప్పిన ప్రతి కంఢీషన్ కి ఈమె కట్టుబడి ఉందని చివరికి తనను మీరు వదిలేసినా ఆమె సైలెంట్ గా ఉందని ఆవేదన వ్యక్తం చేశారట సమంత తండ్రి. ఇకపోతే త్వరలో నాగచైతన్య మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాడు కదా దీనివల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ సమంత జీవితాన్ని రూలింగ్ చేసి, ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు, ఆ భగవంతుడు అన్నీ చూస్తూ ఉంటాడు అంటూ ఎమోషనల్ అయిపోయారట. విడాకులే కదా ఎప్పటికైనా మళ్ళీ కలిసి పోతారని నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా నాగచైతన్య ఇంకో పెళ్లి చేసుకోవడం పైగా సమంతను పట్టించుకోకపోవడం అన్నీ కూడా ఆమెను ఒంటరిని చేసేసాయి. మాకు ఉన్న నమ్మకం కూడా పోయింది అంటూ సమంత తండ్రి బాధ పడినట్లు సమాచారం.ఈ విషయమైతే ఇప్పుడు టాలీవుడ్ లో వైరల్ అవుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు