Samantha : సామ్ కు నాగ చైతన్య ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్… ఇంకా దాన్ని దాచుకుందా?

Samantha : సౌత్ క్వీన్ సమంత రూత్ ప్రభు, నాగ చైతన్య విడాకులు తీసుకుని చాలా కాలమే అవుతున్నా వీరిద్దరికీ సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా ఇట్టే వైరల్ అవుతుంది. తాజాగా సమంత హెల్త్ టిప్ వివాదంలో చిక్కుకోవడంతో గతంలో జరిగిన ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని తవ్వి తీస్తున్నారు నెటిజన్లు. సామ్ కు చై ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ను ఇంకా అలాగే దాచుకుందా ? అని ఆరా తీస్తున్నారు.

చై ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఇదే

నాగ చైతన్య నుండి సమంత అందుకున్న బెస్ట్ గిఫ్ట్ ఏంటో తెలుసా? ఇదే విషయాన్ని ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో సమంత, నాగ సరదాగా ర్యాపిడ్-ఫైర్ గేమ్ ఆడారు. ఆ సమయంలో ఈ జంట కలిసి 2019లో రిలీజైన తమ చిత్రం మజిలీని ప్రమోట్ చేస్తున్నారు. ఆ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో భాగంగా భర్త నుంచి తనకు లభించిన ఉత్తమ బహుమతి గురించిన ప్రశ్నకు సామ్ స్పందిస్తూ “చై నాకు ఇష్టమైన కోట్‌ను చేతితో వ్రాసి, చేతితో పెయింట్ చేసిన బ్యాగ్ ను ఇచ్చాడు. అదే తన బెస్ట్ గిఫ్ట్” అని చెప్పింది. ఇంకా అదే ఇంటర్వ్యూలో చై తాను మాల్దీవులలో సమంతకు ప్రపోజ్ చేసినట్లు వెల్లడించాడు. అంతేకాకుండా సెట్‌లలో షాట్ల మధ్య సామ్ ఎప్పుడూ తన ఫోన్‌ను చెక్ చేస్తుందని కూడా చెప్పుకొచ్చారు.

Akkineni couple- Naga Chaitanya and Samantha to unite againఆ గిఫ్ట్ ను ఇంకా దాచుకుందా?

సామ్ ఇటీవలే తన పెళ్లి డ్రెస్ ను కంప్లీట్ గా మార్చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు నాగ చైతన్య ఇచ్చిన గిఫ్ట్ నైనా దాచుకుందా ? లేక కోపంతో డస్ట్ బిన్ లో పారేసిందా? అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. కాగా చాలా కాలం డేటింగ్ చేసిన సమంత రూత్ ప్రభు, నాగ చైతన్య కుటుంబ సభ్యుల సమక్షంలో 2017 లో వివాహం చేసుకున్నారు. కానీ పెళ్ళయిన కొన్నాళ్ళకే మనస్పర్దల కారణంగా విడిపోవాలని నిర్ణయించుకుని ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు. అయితే విడాకులై చాలాకాలమే అవుతున్నా ఈ జంట గురించి రోజుకో వార్త వైరల్ అవుతోంది.

- Advertisement -

సమంత, నాగ చైతన్య లైనప్

తెలుగు హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ధూతలో చివరిగా కనిపించిన నాగ చైతన్య కార్తికేయ,  ప్రేమమ్ ఫేమ్ దర్శకుడు చందూ మొండేటితో కలిసి తండేల్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ వీరిద్దరి కాంబోలో రాబోతున్న మూడవ చిత్రం. గతంలో వీరిద్దరూ ప్రేమమ్, సవ్యసాచి సినిమాల్లో కలిసి పని చేశారు. తండేల్ మూవీలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది.

మరోవైపు సమంత కిట్టిలో కూడా పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఆమె నెక్స్ట్ సిటాడెల్: హన్నీ బన్నీలో వరుణ్ ధావన్‌తో కలిసి కనిపించనుంది. ఈ భారతీయ స్పై-థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంటుంది. అంతే కాకుండా మా ఇంటి బంగారం చిత్రంలో కూడా సామ్ హీరోయిన్ గా నటిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు