Ram Charan: చరణ్ తో లిప్ లాక్.. సమంత నెంబర్ బ్లాక్ చేసిన ఉపాసన..?

రామ్ చరణ్ భార్యగానే కాకుండా ఓ మహిళ వ్యాపారవేత్తగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు ఉపాసన. ఈమెకి ప్రజాసేవ, వ్యాపారం.. ఈ రెండు మాత్రమే తెలుసు. రామ్ చరణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత చిరంజీవి ఇంటికి కోడలిగా వచ్చింది. ఈ మహిళా వ్యాపారవేత్త ప్రస్తుతం అపోలో లైఫ్ కు వైస్ చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తోంది. ఇదిలా ఉంటే.. చరణ్ భార్య ఉపాసనకు, నాగచైతన్య ఎక్స్ వైఫ్ సమంతకు మధ్య మంచి స్నేహం ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.

ఉపాసన గతంలో నిర్వహించిన యువర్ లైఫ్. కో.ఇన్. వెబ్ సైట్ కి సమంత గెస్ట్ ఎడిటర్ గా కూడా వ్యవహరించింది. అయితే ఇంత మంచి స్నేహితులు అయిన వీరిద్దరి మధ్య గొడవలు జరిగినట్లు ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెళ్లి తర్వాత చెర్రీని రొమాంటిక్ సీన్స్ లో, లిప్ లాక్ సీన్స్ లో నటించవద్దని ఉపాసన కండిషన్స్ పెట్టిందట. చరణ్ కూడా అదే ఫాలో అయ్యాడు. కానీ రంగస్థలం సినిమాలో మాత్రం సుకుమార్ చేసిన తప్పు కారణంగా చరణ్ – ఉపాసన మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తోంది.

చరణ్ పర్మిషన్ లేకుండానే సుకుమార్ సమంతని డైరెక్ట్ గా ముద్దు పెట్టే విధంగా సన్నివేశం రాశాడు. ఈ సీన్ అప్పట్లో చాలా హాట్ టాపిక్. దీని గురించి చెర్రీ.. ఉపాసనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదట. దీంతో ఈ సీన్ అయిపోయిన తర్వాత వీరిద్దరి మధ్య చాలా గొడవలు జరిగాయని టాక్. ఈ దెబ్బతో చెర్రీ మూడు రోజుల వరకు సెట్ కి కూడా వెళ్లలేదట. అప్పటివరకు మంచి స్నేహితులైన ఉపాసన – సమంత మధ్య కూడా మనస్పర్ధలు వచ్చాయని.. సమంత నెంబర్ ని ఉపాసన బ్లాక్ చేసిందని తెలుస్తోంది.

- Advertisement -

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు