BRO: అన్నదమ్ములిద్దరికీ ఒకే పరిస్థితి? గట్టెక్కుతారా?

టాలీవుడ్ లో ఒక కుటుంబం నుండి అన్నదమ్ములు హీరోలుగా రావడం సాధారణం. వాళ్లలో స్టార్స్ అయిన వారు కూడా ఉన్నారు. అయితే ఒకే ఫ్యామిలీ నుండి టాలీవుడ్ ని శాసించే రేంజ్ కి అన్నదమ్ములిద్దరూ ఎదిగారంటే అది కేవలం మెగాస్టార్ చిరంజీవి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే. ముప్పైఏళ్ళు టాలీవుడ్ ని ఏలిన చిరంజీవి, సినిమాలకి గ్యాప్ ఇవ్వగా ఆ స్థానాన్ని పవన్ కళ్యాణ్ భర్తీ చేసి తెలుగు ఇండస్ట్రీని రూల్ చేసాడు. ఇక చిరంజీవి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి కూడా తన క్రేజ్,ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు.

ఇక తాజాగా ఈ అన్నదమ్ములిద్దరూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం వీరిద్దరూ ఒకే సిచ్యువేషన్ లో, సందిగ్దావస్థ లో ఉన్నారు. అదేంటంటే చిరంజీవి భోళా శంకర్, పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలు రెండు తమిళ రీమేక్ సినిమాలు కావడం గమనార్హం.

రీసెంట్ గా విడుదలైన ఈ సినిమాల యొక్క టీజర్స్ పై ఫ్యాన్స్ కూడా కొంచెం డిస్సప్పాయింట్ అయ్యారు. అసలే రీమేక్ సినిమాలు, పైగా విడుదలైన టీజర్లు ఏమి మెప్పించకపోవడంతో అభిమానులు మేకర్స్ పై సీరియస్ అవుతున్నారు.

- Advertisement -

అయితే ఇలాంటి సమయంలోనే వీళ్ళ అసలైన స్టామినా టాలీవుడ్ కి తెలుస్తుంది. టీజర్లతో యావరేజ్ రెస్పాన్స్ తక్కించుకున్న ఈ సినిమాలు కేవలం చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల క్రేజ్ బలంతోనే విడుదలవుతున్నాయన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాల కథ తెలిసిందే అయినా డైరెక్టర్లు తమ క్రియేటివిటీని చూపించి కొంచెం స్క్రీన్ ప్లే బాగా చూపించిన భారీ కలెక్షన్లు కొల్లగొట్టే అవకాశం ఉంది. మరి రీమేక్ సినిమాలతో ఒకే సిచ్యువేషన్ లో ఉన్న మెగా బ్రదర్స్ పరిస్థితి నుండి గట్టెక్కి సక్సెస్ అవుతారో లేదో చూడాలి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు