Samyuktha Menon: ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోబోతున్న సంయుక్త మీనన్..!!

Samyuktha Menon: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించాలని చూస్తున్న వారిలో సంయుక్త మీనన్ కూడా ఒకరు.. టాలీవుడ్ లో మొదట భీమ్లా నాయక్ సినిమాలో రానా భార్యగా నటించి.. తన నటనతో అందరిని ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత ధనుష్ తో కలిసి సార్ సినిమాలో కూడా నటించి మంచి క్రేజ్ అందుకుంది. ఆ వెంటనే కళ్యాణ్ రామ్ తో బింబిసారా సినిమా.. సాయి ధరంతేజ్ తో విరూపాక్ష సినిమాలలో నటించి వరుసగా బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకుంది.

ఇప్పటికే ఈమె నటించిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈమె పేరు ఇండస్ట్రీలో చాలా గట్టిగా వినిపిస్తోంది. అయితే చాలామంది సంయుక్త ను హీరోయిన్ గా పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ఇకపోతే ఈమెకు అవకాశాలు రావడం వెనుక టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఉన్నారనే వార్తలు గత కొన్ని నెలలుగా వినిపిస్తూనే ఉన్నాయి.. దీంతో ఇతర హీరోయిన్ల లాగే సంయుక్త కూడా త్రివిక్రమ్ మాయలో పడిపోయింది అంటూ గతంలో కొన్ని రూమర్స్ వినిపించాయి.

ఈమె మలయాళం బ్యూటీ అయినప్పటికీ సంయుక్త మీనన్ ఇటీవల డెవిల్ సినిమాలో నటించడం జరిగింది. ఈ సినిమానే లాస్ట్ సినిమా అంటూ ఇండస్ట్రీలో పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఈమె త్వరలోనే వివాహం చేసుకోబోతోందని మలయాళ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కేరళ ప్రాంతానికి చెందిన ఒక అబ్బాయి తో సంయుక్త మీనన్ గత కొన్ని ఏళ్లుగా గా లవ్ ట్రాక్ నడుపుతోందని.. త్వరలోనే సంయుక్త ప్రేమించిన వాడిని వివాహం చేసుకోబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

అంతేకాదు వివాహమైన తర్వాత సంయుక్త సినీ పరిశ్రమకు దూరంగా ఉండాలనే నిర్ణయాన్ని కూడా తీసుకుందని సమాచారం.. అందుకే డెవిల్ సినిమానే సంయుక్త కు చివరి సినిమా కాబోతోంది అంటూ పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ప్రస్తుతం వైరల్ గా మారుతున్న ఈ విషయంలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం అభిమానులు మాత్రం షాక్ అవుతున్నారు.. ఇలా చేస్తే కుర్రాళ్ల గుండెలు ఏమైపోవాలి అంటూ పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయం పై సంయుక్త ఎలా స్పందిస్తుందో చూడాలి.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు